మోడీ భోజనం ఖర్చు రోజుకు రూ. 4 లక్షలు: అందుకే టమాటాలా....

Recommended Video

    మ‌ష్రూమ్ @ 80K : మోదీ తింటున్నారంట, మీక్కూడా కావాలా ?

    అహ్మదాబాద్‌: గుజరాత్ కాంగ్రెసు ఓబిసి నేత అల్పేష్ ఠాకూర్ ప్రధాని మోడీపై తీవ్రమై వ్యాఖ్యలు చేశారు. విజయం కాంగ్రెస్‌ పార్టీ పాకిస్తాన్‌తో కుమ్మక్కయిందని విమర్శించిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు.

    పఠాన్‌ జిల్లాలోని రాధన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న అల్పేశ్‌ ఠాకూర్‌ మంగళవారం స్థానికంగా నిర్వహించిన ఒక సభలో మోడీ భోజనం ఖర్చులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

    Modi eats 5 mushrooms a day, each costs Rs 80,000: Alpesh Thakor

    మోడీ తైవాన్‌ నుంచి దిగుమతి చేసుకున్న పుట్టగొడుగులు తింటారని, ఒక్కోటి రూ.80 వేలు ఖరీదైన రోజుకు ఐదు తింటారని ఆయన అన్నారు. అంటే ఆయన భోజనం ఖర్చు రోజుకు రూ.4లక్షలన్నమాట అని అన్నారు. నెలకు కోటీ ఇరవై లక్షలు అవుతాయని ఆయన అన్నారు.

    "ఒకప్పుడు మోడీ.. నా(అల్పేశ్‌) మాదిరిగానే నల్లగా ఉండేవారు. కానీ ఇప్పుడాయన నిగనిగలాడే టమాటా పండులా తయారయ్యారు. మష్రూమ్స్‌ తినడం వల్లే ఆయన ఒంటికి రంగు వచ్చింది. గుజరాత్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆయన మష్రూమ్స్‌ తినడం మొదలుపెట్టారని తెలిసింది" అని అల్పేశ్‌ అన్నారు.

    మోడీ పుట్టగొడుగులు తింటారని ఒకరు తనకు చెప్పారని, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, అందులో తప్పేముందని తాను అన్నానని, అయితే అందరూ తినేవి ఆయన ఇష్టపడరని, తైవాన్ నుంచి తెప్పించుకున్నవే తింటారని తనతో అన్నారని అల్పేష్ ఠాకూర్ అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+