వెంకయ్య అలా చేస్తుంటారా, మోడీ కన్నేసి ఉంచారా?
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మీద ఇప్పుడో వార్త షికారు చేస్తోంది. ఆయన కదలికలపై ప్రధాని మోడీ ఓ రహస్య నిఘా పెట్టారన్నది దాని సారాంశం. ముఖ్యంగా వెంకయ్య ఆర్థిక వ్యవహారాలపై మోడీ ప్రత్యేక ఫోకస్ పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వెంకయ్యనాయుడు ఆస్తులకు సంబంధించిన లెక్కా పత్రాలన్ని మోడీ చేతిలో పడినట్టుగా కేంద్ర రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే.. వెంకయ్య నాయుడుతో పొసగని కొంతమంది సొంత గూటి నేతలే, ఆయనపై మోడీకి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. చేతిలో ఉన్న అధికారాన్ని ఆస్తులను పోగేసుకోవడం కోసం వెంకయ్య ఉపయోగించుకున్నారన్నది ఆయా నేతల ప్రధాన ఆరోపణగా సమాచారం. ఏపీ బీజేపీలో వెంకయ్య నాయుడుతో అంటీముట్టనట్టుగా వ్యవహరించే ఓ వర్గం, వెంకయ్యను ఇరికించాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

విషయాన్ని పసిగట్టిన వెంకయ్య నాయుడు మాత్రం తనపై వస్తున్న ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా ఉండడానికి తనదైన ప్రయత్నాల్లో మునిగిపోయారట. అయితే గుట్టు చప్పుడు కాకుండా ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకునే క్రమంలో ఆయన మరిన్ని బిగ్ డీల్స్ కు తెరదీశారన్న వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారమే మోడీకి వెంకయ్యపై మరిన్ని అనుమానాలను రేకిత్తించిందట.
దీంతో.. కేంద్రమంత్రి అయిన తర్వాత తనకున్న పరిచయాలతో, వెంకయ్య ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు బలపడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అలాగే వెంకయ్యకు మంత్రి పదవి వరించిన తర్వాత ఆయన కుమారుడు హర్షవర్దన్ 40 కంపెనీల్లో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారట. దీనిపై ఆరా తీసిన మోడీ వర్గం హర్షవర్దన్ ఆస్తుల విలువ వెయ్యి కోట్లకు పైగానే ఉండొచ్చన్న అంచనాకు వచ్చారట.
వెంకయ్య కుమార్తె దీప కూడా స్వర్ణ భారత్ పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా బాగానే వెనకేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వెంకయ్యను మోడీ ఓ కంట కనిపెడుతున్నారని.. సందర్భం వస్తే వెంకయ్యకు మోడీ చేతిలో క్లాస్ తప్పదన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.












Click it and Unblock the Notifications