Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. రైల్వే శాఖలో సమూల మార్పులు..

దేశంలో రైల్వే వ్యవస్థ పనితీరును పూర్తిగా మార్చేసే దిశగా మోదీ సర్కార్ అడుగులు వేసింది. మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్.. ఈ మేరకు అతి పెద్ద నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రైల్వేస్ కు సంబంధించి అత్యున్నతన నిర్ణాయక మండలిగా భావించే 'రైల్వే బోర్డు'ను పునర్మించడం.. వివిధ కేడర్లవారీగా కొనసాగుతున్న సిబ్బంది మొత్తాన్ని ఒకే గొడుకు కిందికి తేవడం.. కేబినెట్ నిర్ణయాల్లో ప్రధానమైనవని రైల్వే మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. కేబినెట్ భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇకపై రైల్వే బోర్డులో ఐదుగురే

ఇకపై రైల్వే బోర్డులో ఐదుగురే

రైల్వే శాఖ పనితీరును మరింత మెరుగుపర్చే క్రమంలో రైల్వే బోర్డును రీకన్ స్ట్రక్షన్ చేయాలని కేంద్రం చాలా కాలంగా భావిస్తున్నది. ప్రస్తుతం చైర్మన్ తోపాటు.. ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, స్టాఫ్, ట్రాఫిక్, ఫైనాన్స్, సెక్యూరిటీ, మార్కెటింగ్ విభాగాల తరఫున ఒక్కో సభ్యుడు, కార్యదర్శితో కలిపి మొత్తం ఎనిమిది మంది సభ్యులుండే బోర్డు కొనసాగుతున్నది. కొత్తగా ఏర్పడబోయే బోర్డులో చైర్మన్ తోపాటు నాలుగు విభాగాలకు మాత్రమే సభ్యులుంటారు. అవి..1.ఆపరేషన్స్, 2.బిజినెస్ డెవెలప్మెంట్, 3.హ్యూమన్ రిసోర్సెస్, 4.ఇన్ఫ్రాస్ట్రకచర్ అండ్ ఫైనాన్స్.

డిపార్టుమెంట్లు రద్దు.. ఐఆర్ఎంఎస్ ఒక్కటే

డిపార్టుమెంట్లు రద్దు.. ఐఆర్ఎంఎస్ ఒక్కటే

రైల్వే శాఖలో సిబ్బంది.. కేడర్ల వారీగా విడిపోయి ఉండటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, ఇకపై వాళ్లందరినీ ‘ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సర్వీస్(ఐఆర్ఎంఎస్) గొడుకు కిందికి తీసుకొస్తామని మంత్రి గోయల్ తెలిపారు. రైల్వేలో కేడర్ల విలీనం చరిత్రాత్మక నిర్ణయమని, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఒక్క మోడీ సర్కారుకే సాధ్యమని చెప్పారు.

మోడ్రనైజ్ చేస్తున్నాం: గోయల్

మోడ్రనైజ్ చేస్తున్నాం: గోయల్

‘‘రైల్వేలో మోడ్రనైజేషన్ ను యుద్ధప్రాతిపదికన చేపట్టబోతున్నాం. ఇప్పటికే రైల్వేలకు సంబంధించి అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. మొన్న అక్టోబర్ లోనే తొలి ప్రైవేటు రైలును పట్టాలపైకి తీసుకొచ్చాం. క్యాడర్ల విలీనం వల్ల సిబ్బంది సర్వీసు కోల్పోవడం లాంటి నష్టాలేవీ జరగవు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్ని విజయవంతంగా అమలు చేస్తాం''అని మంత్రి గోయల్ చెప్పారు.

రైల్వే భోజనం.. మారిన ధరలు

రైల్వే భోజనం.. మారిన ధరలు

రైల్వే స్టేషన్లలోని భోజనశాలల్లో పదార్థాల ధరల్ని ఐఆర్ సీటీసీ సవరించింది. జీఎస్‌టీతో కలిపి సవరించిన ధరలు ఇలా ఉన్నాయి..
వెజ్‌ మీల్స్‌: రూ.70
వెజ్‌ బిర్యానీ(350గ్రాములు) : రూ.70
స్టాండర్డ్‌ మీల్స్‌(కోడిగుడ్డు కూరతో): రూ.80
స్టాండర్డ్‌ మీల్స్‌(చికెన్ తో): రూ.120
చికెన్‌ బిర్యానీ: రూ.100
ఎగ్‌ బిర్యానీ: రూ.80
స్నాక్‌ మీల్‌(350 గ్రాములు): రూ.50
వెజిటేరియన్‌ బ్రేక్‌ఫాస్ట్‌: రూ. 35
నాన్‌ వెజిటేరియన్‌ బ్రేక్‌ఫాస్ట్‌: రూ.45

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+