జమ్ము కాశ్మీర్, చైనా ఇష్యూ: మోడీపై మన్మోహన్ సింగ్ నిప్పులు

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిప్పులు చెరిగారు. జమ్ము కాశ్మీర్ విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానంతో పరిస్థితి రోజురోజుకు మారుతోందన్నారు.

దేశ ఆర్థిక పరిస్థితి మోడీ సర్కార్ వైఫల్యానికి అద్దం పడుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్ విషయంలో మోడీ సర్కార్ తీరు సరిగా లేదన్నారు.

Modi government has mismanaged J&K: Manmohan Singh

రోజురోజుకు పరిస్థితి దిగజారుతోందని, తరిచి చూస్తే సరిహద్దుల్లో అభద్రతా భావం నెలకొంటోందని, అంతర్గతంగా చూసినా బోర్డర్ పరంగా చూసినా ఇదే పరిస్థితి అన్నారు.

మోడీ ప్రభుత్వం సంస్కరణలు జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇభ్బంది పెట్టారని, ఉద్యోగాలు కోల్పోయారన్నారు. పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలను సరిదిద్ది, మళ్లీ పట్టాలెక్కించాలంటే కాంగ్రెస్‌కు పెద్ద సవాల్ అవుతుందన్నారు.

ఉద్యోగాల కల్పనలో ఎన్డీయే విఫలమైందన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పిన మోడీ రెండు లక్షలు కూడా ఇవ్వలేదన్నారు.

నాడు సోనియా గాంధీ మార్గదర్శకాలతో కొన్ని క్లిష్టమైన విషయాలను పరిష్కరించామని, పదేళ్ల యూపీఏ పాలనలో ఆమె మార్గదర్శకాలే తనకు ఎంతో బలాన్ని ఇచ్చాయని మన్మోహన్ తెలిపారు.

పాకిస్తాన్, చైనాల పట్ల మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశీ విధానాన్ని తప్పుబట్టారు. జమ్ము కాశ్మీర్ వివాదాన్ని మోడీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్నారు. మన సరిహద్దులు సురక్షితంగా లేవని అర్థమవుతోందన్నారు. మోడీ విధానాల వల్ల ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు ఉన్న పేరు చెడిపోతోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+