Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏరివేతలో మోదీ సర్కార్ వినూత్న పంథా- సక్సెస్‌కు అదే ప్రధాన కారణం

కేంద్ర ప్రభుత్వానికి నక్సలిజంపై పోరాటం కొత్తదేమీ కాదు. దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలపై మావోయిస్టు ప్రభావం ఉంటూ వస్తోంది. వేలాది మంది అమాయక పౌరులు, భద్రతా సిబ్బంది, ప్రజా ప్రతినిధులు మావోయిస్టుల ల్యాండ్‌మైన్లు, దాడుల వల్ల మృత్యువాత పడ్డారు.

వామపక్ష తీవ్రవాదాన్ని గత ప్రభుత్వాలు తీవ్ర అంతర్గత ముప్పుగా గుర్తించినప్పటికీ- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నం. మావోల దేశ భద్రతకు ముప్పు పొంచివుందనే విషయాన్ని గుర్తించడం వల్ల ఎప్పటికప్పుడు మట్టుబెడుతూ వచ్చింది.

Modi govt dismantled key Maoist hideouts with Operation Prahar and Operation Octopus

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏతో పోల్చిచూస్తే- మావోయిస్టుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వ ఉద్దేశం ఏమిటనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ కంటే మెరుగ్గా మావోయిస్టులను ఎన్డీఏ ఎదుర్కొనగలింది. 2004 నుండి 2014 వరకు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో యూపీఏ ప్రభుత్వం నక్సల్ సమస్య తీవ్రతను గుర్తించింది.

దీనికి వ్యతిరేకంగా ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్, ఆపరేషన్ గ్రీన్ హంట్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలు దారి తప్పాయి.. తడబడ్డాయి. సరైన దిశలో అమలు కాలేదు. మావోల పట్ల యూపీఏ ప్రభుత్వం తరచూ రక్షణాత్మక వైఖరిని అనుసరించింది. వారిని అణచివేయడాన్ని చివరి ప్రయత్నంగా మాత్రమే పరిగణించింది.

సామాజిక, ఆర్థికంగా వారిలో మార్పు తీసుకుని రావడానికి యూపీఏ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింద. సాఫ్ట్ కార్నర్ వ్యూహాలపై ఎక్కువగా ఆధారపడింది. భద్రతా చర్యలకు దిగినప్పుడు కూడా యూపీఏ ప్రభుత్వానికి నిఘా ఇన్‌పుట్‌ గానీ, ఖచ్చితత్వంతో కూడుకున్న లక్ష్యాలు గానీ ఉండేవి కావు.

కేంద్ర బలగాలు, రాష్ట్ర విభాగాల మధ్య సమన్వయ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించేవి. హింసను వదులుకోవడానికి ఇష్టపడని మావోలతో చర్చలు సాగించడానికే ఆసక్తి చూపింది యూపీఏ ప్రభుత్వం. ఫలితంగా- నక్సల్ ఉద్యమం దేశంలోని మధ్య- తూర్పు ప్రాంతాలపై పట్టు సాధించగలిగింది. యూపీఏ పాలన చివర్లో కూడా హింస, ప్రాణనష్టం కొనసాగింది.

2014లో పరిస్థితి మారిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మావోయిస్టులపై వినూత్న పంథాను అనుసరించింది. ఈ పోరాటంలో స్పష్టతను తీసుకుని రాగలిగింది. దృఢ సంకల్పాన్ని ప్రదర్శించింది. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలతో సమన్వయాన్ని సాధించగలిగింది.

సాయుధ తిరుగుబాటు పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది మోదీ సర్కార్. ఆయుధాలు అప్పగించేంత వరకూ చర్చలు ఉండబోవని తేల్చి చెప్పింది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారిని నిర్విరామంగా వెంటాడింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నాయకత్వంలో ప్రభుత్వం ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ ఆక్టోపస్ వంటివి చేపట్టింది.

అత్యంత పకడ్బందీ, సమన్వయం, నిఘా-ఆధారిత కార్యకలాపాలను ఈ రెండు ఆపరేషన్ల ద్వారా చేపట్టింది. ఉపగ్రహ నిఘా, డ్రోన్, క్షేత్రస్థాయిలో పక్కా సమాచారాన్ని సేకరించడం వంటి చర్యల ద్వారా కీలకమైన మావోయిస్టు స్థావరాలను కూల్చివేయగలిగింది మోదీ ప్రభుత్వం.

ఎన్డీఏ సర్కార్ వ్యూహాలు ఒక్క ఎన్‌కౌంటర్లకే పరిమితం కాలేదు. అభివృద్ధి కూడా ఒక ఆయుధంగా భావించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, భారత్‌ మాల పరియోజన వంటి పథకాల ద్వారా దోపిడీకి గురైన మారుమూల గిరిజన ప్రాంతాలకు రోడ్లను వేసింది. అభివృద్ధి చెందిన ప్రాంతాలతో వాటిని అనుసంధానించింది.

ఈ రోడ్లు- మార్కెట్లు, పాఠశాలలను చేరువ చేసిందక్కడి గిరిజన, ఆదివాసీలకు. అక్కడి వారికి ప్రభుత్వం పునరావాసాన్ని కల్పించగలిగింది. ఇది కూడా సత్ఫలితాలను ఇచ్చింది. వందలాది మంది మాజీ నక్సల్స్ వృత్తి శిక్షణ, ఆర్థిక ప్రోత్సాహకాలను అందుకున్నారు. సమాజంలో గౌరవప్రదంగా జీవితాన్ని స్వీకరించడానికి లొంగిపోయారు.

హోం మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం- నక్సల్ సంబంధిత హింస 77 శాతం తగ్గింది. సాధారణ పౌరులు, భద్రతా సిబ్బంది మరణాలు 85 శాతం వరకు తగ్గాయి. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట అడవిలో జరుగుతున్న ఆపరేషన్ కగార్.. మావోయిస్టు తిరుగుబాటుకు వ్యతిరేకంగా భారత సంకల్పానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

మావోల కంచుకోటగా చెప్పుకొనే ఈ ప్రాంతాన్ని మోదీ ప్రభుత్వ కూల్చివేయగలిగింది. ఏకంగా 1,00,000 మందికి పైగా పారామిలిటరీ సిబ్బందిని అక్కడ మోహరించారు. కర్రెగుట్ట ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు హతం అయ్యారు. 44 మంది వరకు లొంగిపోయారు.

కర్రెగుట్ట.. మావోలకు బలమైన స్థావరం. దాదాపు 1,000 మంది సాయుధ తిరుగుబాటుదారుల ముప్పు పొంంచి ఉన్నప్పటికీ భద్రత దళాలు అడుగులు ముందుకే వేశాయి. జాతీయ జెండాను సగర్వంగా అక్కడ ఎగురవేశారు. డ్రోన్లు- ఉపగ్రహ నిఘాతో కూంబింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేశారు.

ప్రతి ప్రాంతాన్ని కూడా తిరుగుబాటుదారుల నుండి విముక్తి చేసేంత వరకు విశ్రమించదనే ఓ స్పష్టమైన ప్రకటనను కర్రెగుట్ట ఏరివేత ఘటన జారీ చేసినట్టయింది. మావోయిస్టు హింస పట్ల బీజేపీ సుదీర్ఘకాలంగా అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానానికి అద్దం పట్టినట్టయింది.

2024లో 287 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. 1,000 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. 837 మంది సరెండర్ అయ్యారు. మావోల ప్రభావిత జిల్లాల సంఖ్య 38గా ఉండేది. 2025 జనవరి- మే మద్యకాలంలో 150 మందికి పైగా ఎన్‌కౌంటర్‌లో మరణించారు. అరెస్టులు, సరెండర్లు కొనసాగుతున్నాయి. మావోల ప్రభావిత జిల్లాల సంఖ్య 38 నుంచి ఆరుకు పడిపోయింది.

మావోయిస్టుల హింస సంవత్సరాలుగా వేలాది మంది అమాయకుల ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్‌లో కొంతమంది ఈ ఆపరేషన్‌ను నిలిపివేయాలని పిలుపునిస్తుండగా, శాంతిభద్రతలను పునరుద్ధరించిన తర్వాతే శాశ్వత శాంతి వస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది.

హింసా మార్గాన్ని విడనాడేంత వరకూ వారితో చర్చలు జరపే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కూడా స్పష్టం చేశారు. దేశం ముందుకు సాగుతున్నప్పటికీ- కాంగ్రెస్ వంటి కొన్ని రాజకీయ పార్టీల వైఖరి మాత్రం మారట్లేదు. వాళ్ల మనస్తత్వాలు అలాగే ఉంటోన్నాయి.

బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులపై పోరాటాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్తుండగా ప్రతిపక్షాలు- ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ దీన్ని వ్యతిరేకిస్తోన్నాయి. మావోయిస్టులతో చర్చలు జరపాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ కుమార్తె కవిత వంటి నాయకులు సూచించారు.

ఈ చర్చల విధానం అనేది- గత యూపీఏ ప్రభుత్వం అనుసరించిన విఫల వ్యూహం. ఆపరేషన్ కగార్ కీలక దశలో ఉన్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అగ్ర మావోయిస్టు నాయకులను తమ రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్ళడానికి అనుమతించి ఉండవచ్చనే ఆరోపణలు సైతం వ్యక్తమౌతోన్నాయి.

తుపాకులు పట్టుకుని అమాయకులను హత్య చేసే వారితో బీజేపీ ఎలాంటి చర్చలు జరపబోదని కేంద్రమంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. తెలుగు రాష్ట్రాలు ఒకప్పుడు మావోయిస్టుల ఆధిపత్యంలో అట్టుడికిపోయాయి. పీపుల్స్ వార్ వంటి తిరుగుబాటు గ్రూపులు దాదాపు ప్రతి జిల్లాపైనా ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి.

ఈ గ్రూపులను తరిమి కొట్టడంలో రాజకీయ సంకల్పంలో మార్పు అవసరమని బీజేపీ గుర్తించింది. ఒకప్పుడు మావోయిస్టులకు ప్రధాన షెల్టర్ జోన్‌గా మారుతుందని భయపడిన తెలంగాణ.. ఇప్పుడు తిరుగుబాటు కార్యకలాపాల నుండి చాలావరకు విముక్తి పొందింది.

మావోయిస్టులపై చర్యలకు దిగడానికి యూపీఏ ప్రభుత్వం సంకోచించిన చోట.. ఎన్డీఏ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు, చర్యల తీసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాత వ్యూహాలను అనుసరించాలంటూ డిమాండ్ చేస్తోన్న చోట.. బీజేపీ కొత్త భవిష్యత్తు నిర్మాణానికి పూనుకుంది. 2026 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలనే స్పష్టమైన లక్ష్యం, సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోంది కేంద్ర ప్రభుత్వం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+