మోడీ సర్కారు కొత్త ఏడాది కానుక: 2023 డిసెంబర్ వరకు ఉచిత రేషన్, 81 కోట్ల మందికి లబ్ధి
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు దేశంలోని పేదలకు కొత్త సంవత్సరం కానుకగా ఉచిత రేషన్ పొడిగించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఇచ్చే ఉచిత ఆహార ధాన్యాల పథకాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలోని 81.5 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో జనాభా ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని, వారికి ఏడాది పొడవునా ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తామన్నారు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.2 లక్షల కోట్లను ఖర్చు చేస్తోంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం, గోధుమలు, ముతక ధాన్యాలను అందిస్తుంది.

డిసెంబర్ 31, 2023 వరకు ఉచిత ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంటాయి. ఉచిత ధాన్యం పథకాన్ని డిసెంబర్ 31, 2023 వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కరోనా లాక్‌డౌన్ సమయం నుంచి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2020 నుంచి ఉచిత ఆహార ధాన్యాలను ఇస్తోంది.
కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ పథకం అమలులోకి వచ్చి ఇప్పటికి 28 నెలలు అయిందని చెప్పారు. ఈ పథకం గతంలో చాలాసార్లు పొడిగించబడింది. ఇప్పుడు దాని పదవీకాలం ఈ నెలతో ముగియనుండటంతో మరో ఏడాది పొడిగించడం గమనార్హం.
ऐतिहासिक निर्णय!
— Piyush Goyal (@PiyushGoyal) December 23, 2022
गरीबों को खाद्य सुरक्षा के लिए अब कोई पैसा नहीं देना होगा। PM @NarendraModi जी के नेतृत्व में केंद्र सरकार इस पर होने वाले लगभग 2 लाख करोड़ रूपए के खर्च को शत-प्रतिशत वहन करेगी।#AnnSeAntyoday pic.twitter.com/NJGBh973od
ఓఆర్ఓపీకి కేంద్రం ఆమోదం
విశ్రాంత సైనికాధికారులకు ఓకే హోదా.. ఓకే పింఛను విధానంతో సాయుధ బలగాల్లో 25 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఓఆర్ఓపీలో చేసిన కొన్ని మార్పులకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా విశ్రాంత సైనిక కుటుంబాలతోపాటు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన, శాశ్వత వికలాంగులుగా మారిన సైనికుల కుటుంబాలకు మేలు జరుగుతుందని తెలిపింది.












Click it and Unblock the Notifications