మోడీ ప్రవేశపెట్టిన పథకాలు భారత నవశఖాన్ని ఆవిష్కరిస్తున్నాయి
ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ చాలా వరకు మంచి పథకాలను ప్రవేశపెట్టింది. అంతేకాదు మంచి పాలన అందించేందుకు మరెన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. 2014లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. అది ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనా లేదా ఉజాలా స్కీమ్..ఇలా ఏది తీసుకున్నా వాటిని నెరవేరుస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మోడీ సర్కార్ ఆన్‌లైన్ మీడియాను విరివిగా వినియోగించుకుంది.

భారత ప్రభుత్వం చొరవతో 700 రైల్వే స్టేషన్లలో భారతీయ రైల్వే సంస్థ ప్రయాణికుల కోసం ఉచిత వైఫై సేవలందిస్తోంది. నెలకు 8 మిలియన్ మంది ప్రజలు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇది ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సంస్థతో కలిసి ఈ కార్యక్రమం చేస్తోంది రైల్వే శాఖ.

డిజిటల్ ఇండియా కార్యక్రమంతో ఆర్థికలావాదేవీల్లో విప్లవాత్మకమైన మార్పులు మోడీ సర్కార్ తీసుకొచ్చింది. నగదు లావాదేవీలు తగ్గుముఖం పట్టి ... డబ్బులు చెల్లింపులకు కొత్త ఆన్‌లైన్ పేమెంట్ విధానాలు వచ్చాయి.
డిజిటల్ పద్ధతిలో జరిగే లావాదేవీల ద్వారా ప్రభుత్వం అన్ని లావాదేవీలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేదాన్ని మానిటర్ చేసేందుకు వీలైంది. అదే సమయంలో పన్ను ఎగవేతదారులపై కూడా ఓ కన్నేసి ఉంచొచ్చు. పన్ను ఎగవేత దారులు ఎక్కువయ్యే కొద్ది... ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఎక్కువ ఖర్చు చేసే అవకాశముంది.

మోడీ ప్రభుత్వంలో డిజిటల్ ఇండియాకు పెద్ద పీట వేశారు. ఇందులో భాగంగానే డిజిటల్ లాకర్‌ను ప్రవేశ పెట్టారు. ఇది వినియోగించి వినియోగదారులు తమ ముఖ్యమైన డాక్యుమెంట్లను ఈ క్లౌడ్ స్టోరేజ్‌లో భద్రపరుచుకునే అవకాశముంటుంది. డిజిటల్ లాకర్‌లో భారత పౌరులు వారికి సంబంధించిన ముఖ్య డాక్యుమెంట్లు అంటే ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంట్లను 10 ఎంబీ వరకు ఇందులో భద్రపరుచుకోవచ్చు. వీటిని భద్రపరచుకోవడం ద్వారా ఏదైనా ప్రభుత్వ ఏజెన్సీలకు డాక్యుమెంట్లు సమర్పించాల్సి వస్తే డిజిటల్ లాకర్‌లో ఉన్న డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయొచ్చు.

ఉమాంగ్( UMANG)లేదా యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎన్నో ప్రభుత్వ సేవలను ఈ యాప్ ద్వారా పొందొచ్చు. దీన్ని ప్రధాని నరేంద్రమోడీ గతేడాది నవంబర్‌లో ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా గ్యాస్ బుకింగ్, ఆధార్, పంట బీమా, ఈపీఎఫ్, జాతీయ పెన్షన్ పథకాల సేవలను వినియోగించుకోవచ్చు.

-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications