వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ భద్రతతో మోదీ సర్కార్ ఆటలు -చైనా చొరబాటుపై చర్చకు నో -రాహుల్ గాంధీ ఫైర్, మళ్లీ వాకౌట్

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) దగ్గర ఏం జరుగుతున్నదో వాస్తవాలను ప్రభుత్వం బయటపెట్టాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సరిహద్దులో చైనా ఆక్రమణలపై మోదీ సర్కారు అబద్ధాలు చెబుతూ, దేశ భద్రతతో ఆటలాడుకుంటున్నదని ఆయన ఆరోపించారు. చైనా చొరబాట్లపై, సరిహద్దులో మన సైన్యం స్థితిగతులపై చర్చకు ప్రభుత్వం నో చెప్పడంతో ఆయన మరోసారి మీటింగ్ నుంచి వాకౌట్ చేశారు..

కాంగ్రెస్ అనూహ్య ఎత్తుగడ: లోక్‌సభ నేతగా రాహుల్ గాంధీ -మోదీపై 3అస్త్రాలు -రాజ్యసభ నాయకుడిగా గోయల్కాంగ్రెస్ అనూహ్య ఎత్తుగడ: లోక్‌సభ నేతగా రాహుల్ గాంధీ -మోదీపై 3అస్త్రాలు -రాజ్యసభ నాయకుడిగా గోయల్

రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశం బుధవారం జరగ్గా, ఆ భేటీ నుంచి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వాకౌట్ చేశారు. ఈయనతో పాటు ఇతర కాంగ్రెస్ ఎంపీలు కూడా వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా డోక్లాంతో పాటు సరిహద్దు సమస్యలను చర్చించాలని రాహుల్ బృందం పట్టుబట్టింది. కానీ...

 Modi Govt weakening country, slams Rahul Gandhi, walks out of defence panel over LAC

రక్షణ వ్యవహారాల కమిటీ చైర్మన్ రాహుల్ డిమాండ్లను అందుకు అంగీకరించలేదు. దీంతో ఈ సమావేశంలో కూర్చోవడమే దండగ అంటూ రాహుల్ బృందం సమావేశం నుంచి వాకౌట్ చేసింది. డిసెంబర్ 2020 లో కూడా ఓసారి రాహుల్ రక్షణశాఖా పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

గతేడాది భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరగడం, తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో మన సైనికులు 21 మందిని చైనా బలగాలు చంపడం, ఆ తర్వాత జరిగిన చర్చల్లోనూ చైనా దూకుడు ప్రదర్శించడం తెలిసిందే. నెలలపాటు సాగిన చర్చల ప్రక్రియలో సైనిక బలగాల ఉపసంహరణకు అంగీకారం కుదిరినా, చైనా మాత్రం తరచూ చొరబాట్లకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంటరీ కమిటీలో సరిహద్దు అంశాలపై మాట్లాడాలని రాహుల్ ప్రయత్నించగా, అందుకు ప్రభుత్వం నో చెప్పింది. మరోవైపు,

చైనాతో మళ్లీ చర్చలు -తజకిస్థాన్ వేదికగా విదేశాంగ మంత్రుల భేటీ -LAC వద్ద తోకజాడింపులు వద్దుచైనాతో మళ్లీ చర్చలు -తజకిస్థాన్ వేదికగా విదేశాంగ మంత్రుల భేటీ -LAC వద్ద తోకజాడింపులు వద్దు

భారత్, చైనా విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యీలు బుధవారం తజకిస్థాన్ లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన ఇరు దేశాల నేతలు సుమారు గంటపాటు చర్చలు జరిపారు. కాగా, సరిహద్దులో రెండు దేశాల సైనికులు మళ్లీ ఘర్షణ పడుతున్నట్లు వస్తున్న వార్తలను భారత సైన్యం ఖండించింది.

English summary
Congress leader Rahul Gandhi and other MPs of his party walked out of a meeting of the Parliamentary Panel on Defence on Wednesday. Sources said during the meeting, Rahul Gandhi had demanded a discussion on the prevailing security situation on the Line of Actual Control but the chair denied permission for it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X