Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీడియాకు మోడీ శుభాకాంక్షలు: నేడే నేషనల్ ప్రెస్ డే ఎందుకంటే?

జాతీయ పత్రికా దినోత్సవం(నేషనల్ ప్రెస్ డే) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మీడియా ప్రతినిధులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

న్యూఢిల్లీ: జాతీయ పత్రికా దినోత్సవం(నేషనల్ ప్రెస్ డే) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మీడియా ప్రతినిధులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీడియాపై అతినియంత్రణ తగదన్నారు. మీడియాపై బయటి ఒత్తిడి సమాజానికి మంచిది కాదన్నారు. తప్పుల ఆధారంగా మీడియాపై ఓ అభిప్రాయానికి రావడం సరికాదన్నారు.

Modi greets mediapersons on National Press Day, says committed to upholding freedom of press

మనలో తప్పులు ప్రతీ ఒక్కరు చేస్తారని అన్నారు. మీడియా పనితీరులో మేం జోక్యం చేసుకోబోమన్నారు. ప్రభుత్వానికి సూచనలు చేయడంలో మీడియాది కీలక పాత్ర అని ప్రధాని మోడీ అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మీడియా వారధిలా పనిచేయాలన్నారు.

పత్రికా దినోత్సవం నేడే ఎందుకంటే..?

మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16 న జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు. 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966 నవంబర్‌ను 16వ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. అందుకే అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+