ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం..
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. మోడీకి సైప్రస్ ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ప్రకటించింది. సైప్రస్ దేశాధినేత నికోస్ క్రిస్టోడౌలిడెస్.. పీఎం మోడీని 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III' అనే అత్యున్నత సివిలియన్ పురస్కారంతో సత్కరించారు. కాగా ఇది సైప్రస్ ప్రభుత్వం ఇచ్చే అత్యంత గౌరవనీయమైన పురస్కారాల్లో ఒకటి. ఈ అవార్డు, సైప్రస్-భారత్ ద్వైపాక్షిక సంబంధాలను బలపరిచే విధంగా ప్రధాని మోడీ చేసిన కృషికి ప్రదానంగా దక్కిందని తెలుస్తోంది.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ గౌరవాన్ని అందుకోవడం నాకు పెద్దగా గర్వకారణం అని తెలిపారు. కానీ ఇది తనకు మాత్రమే దక్కిన గౌరవం కాదని.. ఇది 140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ పురస్కారాన్ని సైప్రస్, భారతదేశాల మధ్య ఉన్న బలమైన స్నేహానికి అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు.

మోడీ సైప్రస్‌ను సందర్శించడం ఇది మూడవసారి. ప్రస్తుతం పీఎం మూడు దేశాల పర్యటనలో ఉన్నారు. మొదటగా సైప్రస్‌ను సందర్శించిన మోడీ.. అక్కడి నేతలతో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, డిఫెన్స్ సహకారం, విద్య, టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. ఆ తర్వాత కెనడాలో జరిగే G7 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతారు. చివరిగా ఆయన క్రొయేషియా పర్యటనకు వెళ్లనున్నారు. దీంతో ఈ పర్యటన అంతర్జాతీయంగా ఇండియాకు ఉన్న ప్రాధాన్యతను మరింతగా హైలైట్ చేస్తోంది.
భారత్-పాకిస్తాన్ ఘర్షణల నేపథ్యంలో..
మే నెలలో జరిగిన 'ఆపరేషన్ సిందూర్' తర్వాత మోడీ విదేశీ పర్యటన చేపట్టడం ఇదే మొదటిసారి. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడికి ప్రతిగా భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు చేసింది. అనంతరం 4 రోజుల పాటు సాగిన సరిహద్దు ఘర్షణలకు పాకిస్తాన్ మే 10న కాల్పుల విరమణ కోరింది. ఈ పరిణామాల నేపథ్యంలో మోదీ పర్యటనకు వ్యూహాత్మక ప్రాధాన్యం ఏర్పడింది.
సైప్రస్‌తో భారత్‌కు విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ, డిఫెన్స్ రంగాల్లో అనేక అవకాశాలున్నాయి. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారని అంచనా వేస్తున్నారు. అలాగే సైప్రస్ భారతీయులకు స్నేహపూరిత దేశంగా పరిణమించడానికి ఇది మంచి దోహదం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
భారత్‌లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?












Click it and Unblock the Notifications