ప్రపంచ నేతల్లో అత్యంత ప్రియమైన వ్యక్తి: ప్రధాని మోడీపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ
భారత పర్యటనకు విచ్చేసిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.
న్యూఢిల్లీ: భారత పర్యటనకు విచ్చేసిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన నేత.. మోడీ అని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజామోదం పొందిన నరేంద్ర మోడీ.. ప్రపంచ నేతల్లోనే అత్యంత ప్రియమైన వ్యక్తి అని మెలోని వ్యాఖ్యానించారు.
డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి, ఇతర బృందంతో కలిసి ఇటలీ ప్రధాని గురువారం భారతదేశానికి వచ్చారు. మోడీతో జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే మోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోనే మోడీ కీలక నేత అని నిరూపణ అయ్యిందని, అందుకు ఆయనకు అభినందనలు తెలిపారు.

కాగా, మోడీ, మెలోనీ భేటీలో ఉక్రెయిన్-రష్యా సంక్షోభంపైనా కీలకంగా చర్చించారు. ఉక్రెయిన్ దేశంలో పూర్తిస్థాయిలో ప్రశాంత వాతావరణం ఏర్పడేందుకు ఇరు దేశాలు కృషి చేస్తాయని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు.
Earlier this evening, attended the #RaisinaDialogue2023 and heard the insightful address by PM @GiorgiaMeloni. https://t.co/qJR9LQbnv2 pic.twitter.com/cmvAABxQjT
— Narendra Modi (@narendramodi) March 2, 2023
భారత దేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి.. ఇటలీతో ద్వైపాక్షిక చర్చలపై స్పందించారు. రాజకీయ, వాణిజ్యం, ఆర్థిక, రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంధనం, ఆరోగ్యం, కాన్సులర్, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన విస్తారమైన ఎజెండా వేచి ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.
మరో ట్వీట్‌లో, ప్రధాని మోడీ, ఇటలీ ప్రధాని మెలోనీ మధ్య చర్చలు జరుగుతున్నాయని మిస్టర్ బాగ్చీ చెప్పారు. "వృద్ధిని పెంపొందించడానికి, వివిధ రంగాలలో సహకారాన్ని విస్తృతం చేయడానికి. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై లోతైన కలయికకు పరస్పర నిబద్ధతతో బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంపై నాయకులు అభిప్రాయాలను మార్పిడి చేసుకుంటారు' అని బాగ్చి చెప్పారు.
Had fruitful talks with PM @GiorgiaMeloni, which were focussed on boosting India-Italy cooperation in sectors such as commerce, renewable energy, IT, space and upcoming sectors like semi-conductors and green hydrogen. Deepening ties in StartUps and defence were discussed too. pic.twitter.com/wL7BStJFw4
— Narendra Modi (@narendramodi) March 2, 2023
భారతదేశం-ఇటలీ ఈ సంవత్సరం దౌత్య సంబంధాలను స్థాపించి 75 సంవత్సరాలను జరుపుకుంటున్నాయి. బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలు భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి నిబద్ధత, గ్రీన్ ఎనర్జీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, రక్షణ రంగాలలో సహకారం, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కలయికతో గుర్తించబడతాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కాగా, ప్రధాని మోడీతోపాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా ఇటలీ ప్రధాని మెలోనీ కలిశారు. ఇక, గత సంవత్సరం జీ20 సదస్సులో భాగంగా బాలిలో మోడీ, మెలోనీ భేటీ అయ్యారు. కాగా, గత ఏడాది ఇటలీలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన మెలోనీ.. ఇటలీకి మొదటి మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారంటూ మోడీ కొనియడారు. భారత్ జీ20 అధ్యక్షతకు ఇటలీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని మెలోనీ వెల్లడించారు.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
భారత్లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications