వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాళం పడింది: యూపీ పరాజిత ఎమ్మెల్యేలను వెంటాడుతున్న ‘మోడీ మ్యాజిక్’!

యూపీలో ఓటమి బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఓడిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులను ఇప్పుడు ‘మోడీ మ్యాజిక్’ మరోసారి వెంటాడి మరీ ఇబ్బంది పెడుతోంది. అయితే ఈ ‘మోడీ మ్యాజిక్’కు, ప్రధాని మోడీకి ఎటువం

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంచనాలను తలకిందులు చేస్తూ 325 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో అధికార సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలకు భారీ షాక్ తగిలింది. యూపీ అనూహ్య విజయానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ప్రధాన కారణమని తెలిసిన విషయమే.

కాగా, ఓటమి బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఓడిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులను ఇప్పుడు 'మోడీ మ్యాజిక్' మరోసారి వెంటాడి మరీ ఇబ్బంది పెడుతోంది. అయితే ఈ 'మోడీ మ్యాజిక్'కు, ప్రధాని మోడీకి ఎటువంటి సంబంధం లేదు.

'Modi Magic' Lock Seen Outside House Of Defeated Samajwadi Party MLA

ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలను అధికారిక బంగళాల నుంచి అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అనంతరం వాటికి ఓ కంపెనీ తాళాలు వేస్తున్నారు. ఆ తాళాలపై 'మోడీ మ్యాజిక్' అని ఉండటం గమనార్హం. కాగా, ఈ తళాలు చూసిన పరాజిత ఎమ్మెల్యేలకు మరోసారి షాక్ తగిలినట్లవుతోంది.

ఎన్నికల్లోనూ, బంగళాలోనూ కూడా మోడీ మ్యాజిక్కే ఎదురైందని వాపోతున్నారు. తాళాల తయారీకి ప్రసిద్ధి చెందిన యూపీలోని అలీగఢ్‌లోని ఓ కంపెనీ 'మోడీ మ్యాజిక్' పేరుతో డబుల్ లాకింగ్ ఫీచర్ ఉన్న తాళాలను తయారుచేస్తోంది. అధికారులు ఇప్పుడు ఎమ్మెల్యేల క్వార్టర్లకు ఆ తాళలనే ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ 'మోడీ మ్యాజిక్' తాళాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

English summary
As Uttar Pradesh gets ready to welcome a new government, outgoing MLAs are making way for the newly elected representatives. Incumbent Samajwadi Party suffered a massive defeat at the hands of BJP and defeated MLAs have now started vacating their official residences in Lucknow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X