వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివసేన-కాంగ్రెస్ కు బీజేపీ మార్క్ దెబ్బ: రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది: అసలు ఏం జరిగిందంటే..!

|
Google Oneindia TeluguNews

ఎన్నికల్లో కలిసి పోటీ చేసి..ఫలితాల తరువాత తమతో విభేదించి..ప్రత్యర్ధులతో చేతులు కలిపిన శివసేనకు బీజేపీ తన మార్క్ పొలిటికల్ షాక్ ఇచ్చింది. ఊహించని విధంగా..శివసేన ఎవరితో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిందో..అదే ఎన్సీపీతో కలిసి అనూహ్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండు మరాఠీ పార్టీలు..జాతీయ పార్టీ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దం చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే పేరును ప్రకటించటానికి ముహూర్తం సిద్దమైంది. అంతే..ఢిల్లీలో బీజేపీ వేగంగా పావులు కదిపింది. శివసేన..కాంగ్రెస్ కు ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్రపతి పాలనను తొలిగించి..తమ పార్టీ నేత ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిని చేసింది. తెల్లారే సరికి జరిగిన పరిణామాలతో అటు శివసేన..ఇటు కాంగ్రెస్ విస్తుపోయాయి. ఇంతకీ..రాత్రికి రాత్రి ఇంత భారీ పరిణామాల వెనుక అసలు ఏం జరిగింది.

కలగూర గంప కూటమి: శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సర్కార్ ఆయువు ఏడెనిమిది నెలలే: కేంద్రమంత్రికలగూర గంప కూటమి: శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సర్కార్ ఆయువు ఏడెనిమిది నెలలే: కేంద్రమంత్రి

ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్..

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసారు. శుక్రవారం రాత్రి వరకు శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్..ఎన్సీపీలు అంగీకరించాయి. శనివారం ఆయన్ను మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా సీఎంగా ప్రకటించాలని నిర్ణయించారు. కానీ, ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న మహారాష్ట్ర రాజకీయాలను ఈ కూటమి నేతలు పసి గట్టలేకపోయారు. శనివారం తన పేరు సీఎంగా ప్రకటన చేస్తున్నారనే సంతోషంలో ఉన్న శివసేనకు..తాము తమ విధానాలకు భిన్నంగా బిజేపీకి షాక్ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన కాంగ్రెస్ కు కోలుకోలేని విధంగా బీజేపీ షాక్ ఇచ్చింది. ఫడ్నవీస్ సీఎం గా ప్రమాణ స్వీకారం సైతం పూర్తయింది. దీంతో..వారు విస్తుపోయారు. ఎలా స్పందించాలనే దాని పైన తర్జన భర్జన పడుతున్నారు.

రాత్రికి రాష్ట్రపతి పాలన..ఉదయానికి ముఖ్యమంత్రి పాలన

రాత్రికి రాష్ట్రపతి పాలన..ఉదయానికి ముఖ్యమంత్రి పాలన

మహారాష్ట్రలో బీజేపీ..శివసేన మధ్య తలెత్తిన విభేదాల కారణంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఆ తరువాత ఎన్సీపీకి అవకాశం ఇచ్చినా సమయం మరింత కోరటంతో గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసారు. ఎవరైనా మెజార్టీతో ముందుకు వస్తే రాష్ట్రపతి పాలన తొలిగిస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే, శివసేన..ఎన్సీపీ..కాంగ్రెస్ మూడు పార్టీలు కూటమిగా ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దం అయ్యాయి. చివరి నిమిషం వరకు వేచి చూసిన బీజేపీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంది. ముందే సిద్దం చేసుకున్న వ్యూహాన్ని పక్కాగా అమలు చేసింది. శుక్రవారం రాత్రి వరకు రాష్ట్రపతి పాలనలో ఉన్న మహారాష్ర.. శనివారం ఉదయానికి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయింది. కొత్త ముఖ్యమంత్రి పాలనలోకి వచ్చింది.

శరద్ పవార్ కు తెలిసే జరిగిందా..

శరద్ పవార్ కు తెలిసే జరిగిందా..

రెండు రోజుల క్రితం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని మోదీతో దాదాపు 40 నిమిషాలు సమావేశమయ్యారు. ఆ సమయంలోనే బీజేపీ..ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా అనే అనుమానాలు తెర మీదకు వచ్చాయి. అయితే, కేవలం రైతు సమస్యల మీదనే తాను కలిసానని పవార్ స్పష్టం చేసారు. అయితే, ఇప్పుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి అవ్వటం..ప్రమాణ స్వీకారానికి శరద్ పవార్ హాజరు కాకపోవటం చూస్తుంటే..ఈ కొత్త పరిణామం అసలు శరద్ పవార్ కు తెలిసే జరిగిందా అనే అనుమానం కలుగుతోంది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ కేసుల పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో..బీజేపీ అజిత్ పవార్ ను మేనేజ్ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిందా అనే చర్చ సాగుతోంది.

English summary
BJP mark political shock for Shivasena and Congress in maharatra politics. serious developments taken place between Mumbai and Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X