చాయ్‌వాలా మోడీ: టీ స్టాల్‌కు మహర్దశ, టూరిస్ట్ ప్లేస్
చాయ్‌వాలా నరేంద్ర మోడీ చిన్నప్పుడు టీ విక్రయింటిన స్టాల్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ టీ స్టాల్‌ను టూరిస్ట్ స్పాట్‌గా తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నడిపిన టీస్టాల్‌కు ఇప్పుడు మహర్దశ పట్టింది. చాయ్‌వాలా నరేంద్ర మోడీ చిన్నప్పుడు టీ విక్రయింటిన స్టాల్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ టీ స్టాల్‌ను టూరిస్ట్ స్పాట్‌గా తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
గుజరాత్‌లోని వాద్‌నగర్ స్టేషన్‌లో ఓ ప్లాట్‌ఫాంపై ఉన్న చిన్న టీ స్టాల్‌లో నరేంద్ర మోదీ చిన్నప్పుడు టీ విక్రయించేవారు. ఇప్పుడు స్టాల్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మెహ్‌సానా జిల్లాలోని వాద్‌నగర్ ప్రపంచ పర్యాటక చిత్రపటంలోకి ఎక్కనుంది. ఇందులో భాగంగా కేంద్ర సాంస్కృతిక వ్యవహారాలు, పర్యాటకం, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) మంత్రిత్వశాఖ అధికారులు ఆదివారం వాద్‌నగర్ సందర్శించారు.

కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మహేశ్ శర్మ సారథ్యంలోని బృందం టీ స్టాల్ ప్రాంతాన్ని సందర్శించి వెళ్లింది. టీ స్టాల్ ఒరిజినాలిటీ దెబ్బ తినకుంండా మోడరన్ టచ్ ఇచ్చి దాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు.
మోడీ జన్మస్థలం వాద్‌నగర్ కావడం, దాన్ని అభివృద్ధి చేయడంవల్ల దానికి మంచి ప్రాచుర్యం లభిస్తుందని, దానికి తగ్గట్టే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మోడీ తన బాల్యంలో తండ్రితో కలిసి వాద్‌నగర్ టీ స్టాల్‌లో టీ అమ్మేవారు.












Click it and Unblock the Notifications