మోడీ టీమ్.. పీఎంవో అధికారుల జీతాలెంతో తెలుసా?

న్యూఢిల్లీ : సమాచార హక్కు చట్టం అందుబాటులోకి వచ్చాక.. పారదర్శకతకు మరింత వెసులుబాటు దొరికింది. ఒక్క దరఖాస్తుతో ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని అయినా తెలుసుకునే వీలుండడంతో.. దాపరికాలకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది.

తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా.. ప్రధాని మోడీ కార్యాలయ సిబ్బంది (పీఎంవో) వేతనాల వివరాలు బయటకొచ్చాయి. పీఎంవో సిబ్బంది వేతన వివరాలు కోరుతూ ఓ దరఖాస్తు దారుడు ఆర్జీ పెట్టడంతో ఆర్టీఐ ఆ వివరాలను వెల్లడించింది. ఆర్టీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రధాని మోడీ కార్యదర్శిగా పనిచేస్తోన్న సీనియర్ ఐఏఎస్ అధికారి భాస్కర్ కుల్బే పీఎంవో అధికారుల్లో అత్యధిక వేతనం తీసుకుంటుండగా.. నెలసరి వేతనంగా ఆయనకు రూ.2.01లక్షల అందుతోంది.

Modi shows how it's done as salaries of PMO officials, staff are made public

అలాగే ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రాల నెలసరి వేతనం రూ.1.65లక్షలుగా పేర్కొంది ఆర్టీఐ. అయితే వీరంతా రిటైర్డ్ అధికారులు కావడంతో.. వీరికి పెన్షన్ కూడా అందుతున్నట్లు తెలిసింది.

వీరితో పాటు మరో జాయింట్ సెక్రటరీలయిన రాజీవ్ తాప్నో కురూ.1.46లక్షలు, సంజీవ్ కుమార్ సింగ్లా కు రూ.1.38లక్షలు, సమాచారశాఖ అధికారి శరత్ చందర్ కు రూ.1.26లక్షలు, ప్రధాని పీఆర్వో జేఎం థాకర్కు రూ.99వేలు నెలసరి వేతనంగా అందుతున్నట్లు ఆర్టీఐ ద్వారా తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+