మోడీ ఉద్వేగం: దేశం కోసమే జీవిస్తా, దేశం కోసమే మరణిస్తా
కాలిఫోర్నియా: అమెరికా పర్యనటలో భారత ప్రధాని నరేంద్రమోడీ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ముందుగా సిలికాన్ వ్యాలీలోని ఫేస్‌బుక్, గూగుల్ హెడ్ క్వార్టర్స్‌ను మోడీ సందర్శించారు. ఆదివారం ప్రపంచ టెక్ దిగ్గజాల సీఈఓలతో జరిపిన భేటీలో యావత్ ప్రపంచాన్ని తన ప్రసంగంతో మంత్రముగ్ధులను చేసిన ప్రధాని మోడీ, సోమవారం ఉదయం కాలిఫోర్నియాకు చేరుకున్నారు.
ఈరోజు ఉదయం కాలిఫోర్నియాలోని శాప్ సెంటర్‌లో ఎన్నారైలను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. దీంతో శాప్ సెంటర్‌కు ఇప్పటికే వేలాది మంది ప్రవాస భారతీయులు తరలివచ్చి ఆయనరాక కోసం వేచి చూస్తున్నారు. కాలిఫోర్నియాలోని శాఫ్ సెంటర్ ప్రధాని మోడీ నామస్మరణతో మార్మోగుతోంది.
Kailash Kher performs at the SAP Center (San Jose), PM Modi to speak here shortly #ModiAtSAPCenter pic.twitter.com/co7pZzbKZT
— ANI (@ANI_news) September 28, 2015 మోడీ రాకకు ముందే సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తిన ఆ సెంటర్ మోడీ రాకతో భారత నినాదాలతో మారుమోగింది. గతంలో మ్యాడిసన్ స్క్వేర్ మీటింగ్ ను తలపించేలా అక్కడి ప్రవాస భారతీయులు శాప్ సెంటర్‌కు భారీగా తరలివచ్చారు. తమనుద్దేశించి ప్రసంగించేందుకు వచ్చిన మోదీకి ప్రవాస భారతీయులు ఆత్మీయ స్వాగతం పలికారు.
A Madison Square Garden moment for Silicon Valley. The SAP Center is jampacked as PM @narendramodi arrives pic.twitter.com/CRy2NuldpR
— Vikas Swarup (@MEAIndia) September 28, 2015 జనగణమణ గీతం అనంతరం ప్రధాని మోడీ శాప్ సెంటర్‌లో అందరికీ అభివాదం చేశారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్‌సింగ్ జన్మదినం నాడు ప్రవాస భారతీయులను కలుసుకోవడం తనకు ఆనందంగా ఉందని అన్నారు.

భరతమాత ముద్దుబిడ్డకు శతకోటి వందనాలు అంటూ వ్యాఖ్యానించారు. ప్రధానిగా ఇది తనకు ఇది రెండోసారి అమెరికా పర్యటన అని అన్నారు. గతేడాది పర్యటనలో మాడిసన్ స్వ్కేర్‌లో భారతీయులను కలిశానని, సరిగ్గా ఏడాది తర్వాత కాలిఫోర్నియాలో ఎన్నారైలను కలిశానన్నారు. అమెరికా ప్రజలు భారతీయుల పట్ల గౌరవం చూపుతారన్నారు.
SAP centre at San Jose. Kailash Kher is rocking here prior 2 PMs grand entry. pic.twitter.com/drKRH0fJFR
— Amitabh Kant (@amitabhk87) September 28, 2015 మేథో సంపత్తితో భారతీయులు ప్రపంచ గమనాన్ని శాసిస్తున్నారని వ్యాఖ్యానించారు. తన ఐదు రోజులు అమెరికా పర్యటనలో ఎంతో మందిని కలిశానన్నారు. దేశం కోసం నిరంతరం కృషి చేస్తున్నానని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దం ఆసియా ఖండానిదేనని అన్నారు. 125 కోట్ల భారతీయుల సంకల్పంలో మార్పు వచ్చిందన్నారు.
ఈ మార్పు ఒక్క మోడీ వల్లే వచ్చింది కాదన్నారు. భారతీయుల చేతివేళ్లు కంప్యూటర్ కీబోర్డుపై మ్యాజిక్ సృష్టిస్తున్నందువల్లే భారత్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. గోపాల్ ముఖర్జీ 1940లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో చదివిన మొట్టమొదటి భారతీయుడని, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కాలిఫోర్నియాలో చదువుకున్నారని మోడీ వ్యాఖ్యానించారు.
Dear @google, a big thanks for hosting me & giving me a tour of the various technological advancements & innovations pic.twitter.com/hCPS7S4eNQ
— Narendra Modi (@narendramodi) September 28, 2015 Various dance forms of India performed at the SAP Center in San Jose, California #ModiInSAPCenter pic.twitter.com/Guu0mTZbfZ
— ANI (@ANI_news) September 28, 2015 శాప్ సెంటర్‌లో ప్రధాని మోడీ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. తొలుత కాస్తంత సాధారణ వ్యాఖ్యలతోనే ప్రారంభమైన ఆయన ప్రసంగం క్రమంగా ఉద్వేగభరితంగా మారింది. మోడీ ఏం చేస్తున్నాడో అంతా మీకు తెలుసు. నేను కష్టపడటంలో ఏమాత్రం వెనకడుగు వేయను. దేశప్రజలు నాకిచ్చిన బాధ్యతను నెరవేర్చేందుకు ప్రతి క్షణం, శరీరంలో ప్రతి కణం నూటికి నూరుశాతం పనిచేస్తానన్నారు.
16 నెలల తర్వాత నాకు మీ సర్టిఫికెట్ కావాలి. నా ప్రమాణం నేను నిలబెట్టుకున్నానా లేదా? శ్రమ పడుతున్నానా లేదా? దేశం కోసం చేస్తున్నానా? మీరు నాకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తున్నానా లేదా? మన దేశంలో రాజకీయ నాయకుల మీద కొద్ది కాలానికే ఆరోపణలు వస్తాయి.
PM with d Governor of California, Edmund Brown. Discussions on sustainable & innovative urbanisation. pic.twitter.com/Pr2hcZRkWG
— Amitabh Kant (@amitabhk87) September 27, 2015 ఆయన 50 కోట్లు, ఈయన 100 కోట్లు తీసుకున్నాడని అంటారు. కొడుకు 150 కోట్లు, కూతురు 500 కోట్లు, అల్లుడు వెయ్యి కోట్లు సంపాదించుకున్నాడని అంటారు. నా మీద ఏమైనా ఆరోపణలున్నాయా? నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. దేశం కోసమే జీవిస్తా... దేశం కోసమే మరణిస్తానని ఉద్వేకంగా ప్రసంగించారు.
మన దేశం శక్తి, సామర్థ్యాలతో నిలబడింది. ఇంత ఆత్మవిశ్వాసం మీకు ఎక్కడినుంచి వచ్చిందని చాలా మంది అడుగుతారు. మీ దేశం ముందుకెళ్తుందని ఎలా తెలుసని అంటారు. నాకు మాత్రం పూర్తిగా విశ్వాసం ఉంది. ఎందుకంటే నా దేశం యువదేశం. ఏదైనా దేశంలో 65 శాతం జనాభా 35 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవాళ్లయితే ఆ దేశం ఏం చేయలేదు? 800 మిలియన్ల యువత ఉన్నప్పుడు 1600 భుజాలు కలిస్తే.. ఏం చేయలేవు? ఇక ఈ దేశం వెనకబడి ఉండలేద'ని పేర్కొన్నారు.
Discussing India - US collaboration in renewable energy. PM @narendramodi meets with Secretary @ErnestMoniz pic.twitter.com/qS1ZhceizV
— Vikas Swarup (@MEAIndia) September 27, 2015 భారత్ ప్రగతి బాటలో దూసుకెళుతోందన్నారు. ఉపనిషత్తుల స్థాయి నుంచి ఉపగ్రహాలు ప్రయోగించే స్థాయికి చేరుకున్నామన్నారు. ఉపగ్రహాల ప్రయోగాల కోసం డబ్బును వృథా చేస్తున్నారని గతంలో విమర్శలు వస్తే, ప్రస్తుతం అవే ఉపగ్రహాల ప్రయోగంతో భారీ సంపాదన రాబట్టే స్థాయికి చేరుకున్నామన్నారు.
మామ్ లాంటి భారీ ఉపగ్రహాల ప్రయోగంలో తొలి యత్నంలోనే భారీ విజయాన్ని నమోదు చేశామన్నారు. 800 మిలియన్ల జనాభా ఉన్న భారతీయులు తలచుకుంటే ఏమైనా చేయగలరని శాప్ సెంటర్‌లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications