నోర్ముసుకోని కూర్చో: ప్రశ్నిస్తే మోడీకి నచ్చదన్న బిజెపి ఎంపీ నానాపటోల్
నాగ్‌పూర్: బిజెపికి చెందిన ఎంపి ప్రధానమంత్రి మోడీపై విమర్శల వర్షం కురిపించారు. ప్రభుత్వ వ్యూహల గురించి ప్రశ్నిస్తే ప్రధానమంత్రి మోడీకి నచ్చదని మహరాష్ట్రకు చెందిన బిజెపి ఎంపీ నానాపటోల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తాను లేవనెత్తిన సమస్యలపై మోడీ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన ఆరోపించారు. గ్రీన్‌ట్యాక్స్‌ను పెంచాలని, ఓబిసిలకు ప్రత్యేకంగా శాఖను ఏర్పాటు చేయాలని తాను పార్టీ పార్లమెంటరీ సమావేశంలో లేవనెత్తితే మోడీ తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తారని ఆయన ఆరోపించారు.
పార్లమెంటరీ సమావేశంలోనే తన నోరు మూసుకుంటావా అని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారని నానాపటోల్ ఆరోపించారు.పార్టీ మ్యానిఫెస్టోను చదివారా, ప్రభుత్వ పథకాల గురించి మీకు తెలుసా అంటూ మోడీ తనను ప్రశ్నించారని నానా పటోల్ చెప్పారు.

2014 ఎన్నికల్లో గోండియా-భందారా నియోజకవర్గం నుండి ఎన్‌సిపి నాయకుడు ప్రపుల్‌పటేల్‌పై నానా పటోల్ విజయం సాధించారు. అయితే బిజెపి నేతలు ప్రపూల్ పటేల్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు.
దీంతో నానాపటోల్ అసంతృప్తితో ఉన్నారు.పార్టీ తనను టార్గెట్ చేసుకొన్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. అయినా తనకు ఎలాంటి భయం లేదని ఆయన అన్నారు. మోడీ మంత్రివర్గంలోని మంత్రులంతా భయంతో బతుకుతున్నారని ఆయన ఆరోపించారు.
నానాపటోల్ విమర్శలపై మహరాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నిరాకరించారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై కూడ నానాపటోల్ విమర్శలు గుప్పించారు.
రైతుల బాధలను తీర్చడంలో దేవేంద్ర ఫడ్నవీస్ విఫలమయ్యారని ఆయన ఆరోపణలు చేశారు. నిధుల కొరత కారణంగానే విదర్భలోని ప్రాజెక్టులన్నీ నత్తనడకనసాగుతున్నాయని నానా పటోల్ ఆరోపించారు.
ఫడ్నవీస్ నాగ్‌పూర్‌కు చెందినందున, ఆ ప్రాంతానికే ఎక్కువ నిధులను కేటాయిస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. నాగ్‌పూర్‌కు మెట్రోరైలు, కొత్త పరిశ్రమలు రావడం వల్ల ఆ ప్రాంతమంతా కాలుష్యానికి గురౌతోందని నానాపటోల్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications