యూపీ నుంచే బీజేపీ పతనం!.. మోడీని సాగనంపడం ఖాయమని మాయా జోస్యం!

లక్నో : పోలింగ్‌కు సమయం దగ్గరపడే కొద్దీ నాయకులు ప్రత్యర్థులపై విమర్శల పదును పెంచారు. ఢిల్లీలో అధికారానికి దగ్గర దారిగా భావించే యూపీలో ఎస్పీ- బీఎస్పీ కూటమి విజయమే లక్ష్యంగా మాయావతి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేసిన బెహన్ జీ ట్విట్టర్ వేదికగా మాటల తూటాలు పేల్చారు. యూపీ నుంచే బీజేపీ పతనం ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు.

గత ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన ఉత్తర్‌ప్రదేశ్ ఓటర్లు ఈసారి మోడీ సర్కారు పతనానికి నాంది పలుకుతారని మాయావతి జోస్యం చెప్పారు. మోడీ యూపీ ప్రజలను మోసగిస్తూ వారి విశ్వాసాన్ని కోల్పోయారని విమర్శించారు. ఆయనను ప్రధానిని చేసిన ఓటర్లే ఈసారి లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓ పదవి నుంచి సాగనంపుతారని మాయా వరుస ట్వీట్లు చేశారు.

modi will be voted out by the people of UP : Mayawati

ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన మోడీ వారి విశ్వాసాన్ని కోల్పోయారని మాయావతి అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే మోడీ తాను వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తినని చెప్పుకుంటారని ఆరోపించారు. బీసీల అభివృద్ధి కోసమే ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలు కూటమిగా ఏర్పడ్డాయని మాయావతి స్పష్టంచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+