• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీ-జిన్ పింగ్ సమావేశం: మహాబలిపురంనే వేదికగా ఎందుకు ఎంచుకున్నారు..?

|

మహాబలిపురం: భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల అనధికారిక సమావేశానికి తమిళనాడులోని మహాబలిపురం వేదికగా నిలిచింది. అయితే మహాబలిపురంనే భారత ప్రభుత్వం ఎందుకు ఎంచుకుంది..? దీని వెనక కారణం ఏదైనా ఉందా అనేది చాలా మంది చర్చించుకుంటున్నారు. సాధారణంగా విదేశీ దేశాధినేతలు భారత్‌లో పర్యటించిన సమయంలో ఢిల్లీలో చర్చలు జరుపుతారు. అయితే ఇది అనధికారిక సమావేశం కావడం విశేషం. అయితే మహాబలిపురంనే ఎందుకు ఎంచుకున్నారు.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

పెద్ద పెద్దోళ్లు వస్తేనే క్లీన్ చేస్తారా?: జిన్ పింగ్ టూర్ పై మద్రాస్ హైకోర్టు

మహాబలిపురం వేదికగా మోడీ-జిన్‌పింగ్ భేటీ

మహాబలిపురం వేదికగా మోడీ-జిన్‌పింగ్ భేటీ

ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు మహాబలిపురం వేదికగా సమావేశం కానున్నారు. మహాబలిపురం ఈ అగ్రనేతల భేటీకి వేదిక కావడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇందుకు ఓ కారణం ఉంది. చైనా అధ్యక్షుడికి చరిత్ర అన్న సంస్కృతి అన్న చాలా ఇష్టమట. అంతేకాదు చైనాకు మహాబలిపురంకు మధ్య సంబంధం కూడా ఉంది. అంతేకాదు ఇలాంటి సమావేశాలు నిర్వహించడం వల్ల బీజేపీకి రాజకీయంగా కూడా తమిళనాడు కలిసి వచ్చే అవకాశం ఉంది.

 మహాబలిపురం చైనాల మధ్య సంబంధం ఏంటి..?

మహాబలిపురం చైనాల మధ్య సంబంధం ఏంటి..?

మహాబలిపురంకు ఎంతో ఘనచరిత్ర ఉంది. పల్లవ వంశీయులు పాలించిన సమయంలో దక్షిణ భారత దేశంలో ఇక్కడ అతి ముఖ్యమైన పోర్టు ఉండేది. ఈ నౌకాశ్రయం నుంచే చైనాతో వాణిజ్య సంబంధాలు ఉండేవి. భారత్‌లో తయారైనా చాలా వస్తువులు మహాబలిపురంలోని నౌకాశ్రయం నుంచి చైనాకు రవాణా చేసేవారు. ఇక్కడ దొరికిన కొన్ని వస్తువులే ఇందుకు ఆధారం. ఇక ప్రపంచదేశాలతో చైనాకు ఉన్న ప్రాచీన సంబంధాల గురించి తెలుసుకోవడం జిన్‌పింగ్‌కు ఎంతో ఆసక్తి ఉందట. అందుకే మహాబలిపురంను ఎంచుకున్నట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీలో కాకుండా ఇతర ప్రాంతంలో సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాని మోడీ అధికారులను ఆదేశించారు.

బౌద్ధమతం స్వీకరించిన పల్లవ యువరాజు

బౌద్ధమతం స్వీకరించిన పల్లవ యువరాజు

ఇది కాకుండా మహాబలిపురం చైనాల మధ్య మరో సంబంధం ఉంది. పల్లవ రాజుల వంశానికి చెందిన ఓ యువ రాజును చైనాలో బోధిధర్మగా సంబోధిస్తారు.అతని అసలు పేరు మాత్రం తెలియకపోయినప్పటికీ పల్లవరాజుల వంశానికి చెందిన వాడని మాత్రం తెలుసు. పల్లవరాజుకు ఈయన మూడో సంతానం అని చరిత్ర చెబుతోంది. చిన్న వయస్సులోనే తాను బౌద్ధ మతంను స్వీకరించారు. గౌతమ బుద్ధుడు నేర్పించిన ధ్యానంను ఆయన పాటించేవాడు. అహింసా మార్గమే ఆయుధంగా చేసుకుని యుద్ధాలు లేకుండా చూశాడట. బౌద్ధమఠంలో ఉన్నత స్థానానికి ఎదిగిన తర్వాత ఆ మఠంకు 28వ అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. చైనాలోని బౌద్ధ గ్రంథాల్లో గౌతమ బుద్ధుడు నుంచి ప్రారంభమై మఠం అధిపతుల పేర్లను ఇందులో చేర్చారు. ఇందులో బోధిధర్మ పేరు కూడా ఉంది.

బౌద్ధమతం గురించి బోధించేందుకు చైనాకు బోధిధర్మ

బౌద్ధమతం గురించి బోధించేందుకు చైనాకు బోధిధర్మ

బౌద్ధ మతం గురించి బోధించేందుకు బోధిధర్మ పలుమార్లు మహాబలిపురం నుంచి చైనాకు వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది. 9 ఏళ్లపాటు ప్రజలతో మాట్లాడకుండా కేవలం ధ్యానంలోనే ఉంటూ అక్కడి ప్రజలను ఆకట్టుకున్నాడు. వు అనే చైనా రాజు బోధిధర్మను తన ముందు హాజరుపర్చాలని ఆయన్నుంచి తాను ఆశీర్వాదాలు పొందాలని భావించినప్పటికీ బోధి ధర్మ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నిరాశకు గురైనా చైనా రాజు బోధిధర్మపై బహిష్కరణ వేటు వేసినట్లు చరిత్ర చెబుతోంది. అయితే బోధిధర్మ మాత్రం ప్రజలకు బౌద్ధమతం గురించి చెబుతూ ముందుకు సాగారు. ఈ క్రమంలోనే తనకు చాలామంది భక్తులు తయారయ్యారు. ఇక బౌద్ధ భక్తులకు బోధిధర్మ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించారట. ఇది షాఓలిన్ ఆలయంలో నేర్పించడంతో ఆ మార్షల్ ఆర్ట్స్‌కు షాఓలిన్ మార్షల్ ఆర్ట్స్ అనే పేరు వచ్చింది. ఈ మార్షల్ ఆర్ట్స్‌ను ఇప్పుడు కొన్ని హాలీవుడ్ సినిమాల్లో చూపిస్తున్నారు.

రాజకీయంగాను బీజేపీ బలపడేందుకు ఎత్తుగడ..?

రాజకీయంగాను బీజేపీ బలపడేందుకు ఎత్తుగడ..?

బోధిధర్మ చైనాలో బోధించిన బౌద్ధ పాఠాలకు చాన్ అనే పేరు ఉంది. మన సంస్కృతంలో దీన్ని ధ్యాన్ అని పిలుస్తున్నాము. కాలక్రమంలో బౌద్ధ మతం జపాన్, థాయ్‌లాండ్, ఇండోనేషియాతో పాటు ఇతర తూర్పు దేశాలకు వ్యాపించింది. ఆ తర్వాత ఇది జెన్ బౌద్ధంగా ప్రసిద్ధి చెందింది. బౌద్ధ మతం పరంగా చైనాతో మహాబలిపురం కనెక్షన్ కలిగి ఉండటంతో దీన్నే వేదికగా ఎంచుకోవడం జరిగింది. అయితే ఇందులో రాజకీయ కోణం కూడా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడులో బీజేపీ ఎదిగేందుకు ఇలాంటి అంతర్జాతీయ సమావేశాలు ఊతమిస్తాయని పలువురు అనలిస్టులు భావిస్తున్నారు.

English summary
Choice of Mamallapuram near Chennai for an informal meeting between Prime Minister Narendra Modi and Chinese President Xi Jinping came as a surprise to many. But the choice of venue was fashioned by certain considerations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more