370, ట్రిపుల్ తలాక్, రామాలయం పూర్తి- ఇక, మోడీ నెక్స్ట్ టార్గెట్..!?
దేశ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. కోట్లాది ప్రజల సుదీర్ఘ కల నెరవేరింది. రాజకీయంగా విమర్శలు ఎలా ఉన్నా..ఈ క్రెడిట్ మోదీ ఖాతాలో జమ అవుతోంది. ప్రధానిగా మోదీ రెండో సారి గెలిచిన సమయం నుంచి బీజేపీ దేశంలో తీసుకురావాలని భావించిన మార్పులు..లక్ష్యాలను మోదీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. అందులో ఇప్పటికే కొన్నింటిని సాధించారు. ఇప్పుడు రామాలయం పూర్తి అయింది. ఇక, మోదీ తదుపరి లక్ష్యం ఏంటో స్పష్టం అవుతోంది.
మోదీ వరుస విజయాలు: బీజేపీ తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటూ దశాబ్దాల కాలంగా తమ అజెండా ప్రకటిస్తూ వచ్చింది. కానీ, పూర్తి మెజార్టీ బీజేపీకి దక్కలేదు. మోదీ తొలి సారి ప్రధాని అయిన తరువాత పూర్తిగా పట్టు సాధించేందుకు, దేశ ఆర్దిక వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యత ఇచ్చారు. 2019లో అధికారంలోకి వస్తూనే పార్టీ లక్ష్యాలను..సుదీర్ఘ సంక్లిష్ట అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వచ్చారు.

అందులో భాగంగా ట్రిపుల్ తలాక్ ను రద్దు చేస్తూ కేంద్రం చట్టం చేసింది. దీని పైన కొన్ని అభ్యంతరాలు వచ్చినా.. అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఆ నిర్ణయం బీజేపీకి కలిసి వచ్చింది. ఇక, జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370డీ రద్దు అంశాన్ని మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా తెర మీదకు తీసుకొచ్చింది. ముందుగా జమ్ము కాశ్మీర్ లో పరిస్థితిని తమ అదుపులోకి తెచ్చుకుంది.
సుదీర్ఘ కాల సమస్యలకు పరిష్కారం: ఆ తరువాత పార్లమెంట్ లో 370 మార్పు ద్వారా జమ్ము కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్త హోదా రద్దుకు ఆమోదం తెలిపింది. భారత్ లో భాగమని విస్పష్ట ప్రకటన చేసింది. సార్వత్రిక ఎన్నికల సమయంలోనే జమ్ము కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించే క్రమంలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతోంది. ఇక, యూసీసీ అంశం పైన కసరత్తు చేసింది. ఇక...అయోధ్యలో రామజన్మభూమి వివాదం పైన సుప్రీం కోర్టులో తీర్పు వస్తూనే..మోదీ వేగంగా అడుగులు వేసారు.
2020 ఆగస్ట 5న రామాలయంకు భూమి పూజ చేసారు. మెజార్టీ హిందు ఓటింగ్ ను ఆకర్షించేలా కాశీలో మార్పులు చేసారు. సరి కొత్త ఆధ్యాత్మిక నగరిని నిర్మించారు. అయోధ్యలో ఆలయ నిర్మాణ బాధ్యతలు కోర్టు సూచనల మేరకు ట్రస్టుకు అప్పగించారు. యూపీ సీఎం యోగీ రామాలయం నిర్మాణంలో స్థానిక రాష్ట్ర ప్రభుత్వాధినేతగా కీలకంగా వ్యవహరించారు. 2024 ఎన్నికలకు ముందే పూర్తి చేయాలనే సంకల్పంతో పని చేసారు. యావత్ దేశం అయోధ్య వైపు చూసేలా ఈ ఆలయం ప్రాంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
మోదీ నెక్స్ట్ టార్గెట్: 2024 ఎన్నికలకు ముందే పూర్తి చేయాలనే సంకల్పంతో పని చేసారు. యావత్ దేశం అయోధ్య వైపు చూసేలా ఈ ఆలయం ప్రాంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.అయోధ్య రామాలయం పైన ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా..మోదీ సక్సెస్ రేట్ పెరిగింది. ఇక..బీజేపీ స్థాపించిన నాటి నుంచి మరో కీలక లక్ష్యం పెండింగ్ లో ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో అంతర్భాగం చేయటం. గతంలో పుల్వామా లో భారత్ సైనికులపై దాడుల తరువాత మోదీ ప్రభుత్వం పాక్ ఉగ్రవాద శిబిరాల పైన సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. మోదీ వరుసగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యం వేళ పీఓకే పైన ఏం చేస్తారు..అదే తరువాతి టార్గెట్ కాబోతుందా అనే చర్చ మొదలైంది.
మోదీకి అంతర్జాతీయ స్థాయిలోనూ అనూహ్య మద్దతు లభిస్తోంది. కానీ, చైనా వంటి పొరుగు దేశాలతో సమస్యలు ఉన్నాయి. ఈ సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో మోదీ మంత్రాంగం..రాజ తంత్రం ఎలా ఉంటుందనేది చూడాలి. మూడో సారి అధికారం ఖాయమని భావిస్తున్న వేళ మలి విడత ప్రభుత్వంలో నిర్ణయాలు ఉంటాయా అనే చర్చ వేళ..రానున్న రోజుల్లో ఆసక్తి కరంగా మారుతోంది.
-
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications