ఫేస్ బుక్ లైకుల్లోను మోడీ రికార్డు : ఆ పోస్టుకు 3.4 కోట్ల లైక్స్

న్యూఢిల్లీ : సాంకేతిక అభివృద్ది చెంది సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. మనుషుల మధ్య సంబంధాలన్నీ ఫేస్ బుక్, వాట్సాప్ లతో ముడిపడిపోయాయి. స్నేహితుల జాబితాను పెంచుకోవడం, వ్యక్తిగత ఇమేజ్ ను లైకులు కామెంట్లతో కొలవడం మొదలుపెట్టాక.. రాజకీయ నేతలది ఇప్పుడు అదే బాట. తమ కార్యకలాపాలన్నింటిని ఫేస్ బుక్ ద్వారా నిత్యం ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు నేతలు.

ఈ విషయంలో అందరికంటే ముందు వరుసలో ఉన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఫేస్ బుక్ యాజమాన్యం బయటపెట్టిన తాజా లెక్కలే ఇందుకు నిదర్శనం. సరిగ్గా ఈరోజుకి మోడీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవడంతో ఆయన పాలనకు సంబంధించిన వ్యవహారాలను జనంలోకి తీసుకెళ్లడానికి ఫేస్ బుక్ ను ఎలా ఉపయోగించుకున్నారో కంపెనీ వెల్లడించింది.

ఫేస్ బుక్ పోస్టుల ఆధారంగా మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులకు కూడా ర్యాంకులు కేటాయించింది ఫేస్ బుక్ యాజమాన్యం. ఇందుకోసం ఆయా నేతలు ఉపయోగించుకుంటున్న లైవ్, ఇన్ స్టంట్ ఆర్టికల్స్, నోట్స్ ను ప్రతిపాదికగా తీసుకున్నట్టుగా సమాచారం. ఇకపోతే ఈ జాబితాలో మోడీ తన తల్లి హీరాబెన్ తో కలిసి ఉన్న ఫోటోకు ఫేస్ బుక్ లో 34,047,024 లైక్స్ రావడం గమనార్హం.

ఆ తర్వాతి స్థానాల్లో డిజిటల్ ఇండియా ఇన్షియేటివ్స్ గా ఫేస్ బుక్ సీఈవో తో సమావేశమైన పోస్ట్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ లతో సమావేశమైన పోస్టులు జాబితాలో చోటు సంపాదించినట్టు ఫేస్ బుక్ పేర్కొంది .

ఇక లైక్స్, కామెంట్స్, షేర్స్, డైలీ పోస్టులు, యావరేజ్ వంటి ప్రాతిపదికన మోడీ కేబినెట్ లోని మంత్రులకు కూడా ర్యాంకులు కేటాయించింది ఫేస్ బుక్.

modis record in facebook likes for his mother post

ఫేస్ బుక్ వెల్లడించిన ర్యాంకుల జాబితా వివరాలు :

1.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
2.కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
3. మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ
4. ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ
5. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్
6. విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్
7. కమ్యూనికేషన్స్ మంత్రి రవి శంకర్ ప్రసాద్
8. రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
9. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు
10. మాజీ క్రీడాశాఖ మంత్రి, అసోం ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్

ఈ పది ర్యాంకుల తర్వాతి స్థానాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, సమాచార ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ తదితరులు ఉన్నారు. బీసీసీఐ కొత్త అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఫేస్ బుక్ లైవ్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టుగా పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+