మోగా లైంగిక దాడి: అమ్మాయి మృతి దైవసంకల్పమని మంత్రి వ్యాఖ్య

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని మోగా జిల్లాలో జరిగిన లైంగిక దాడి ఉదంతంపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సుర్జీత్ సింగ్ రఖ్రా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఇటీవల ఓ ప్రైవేట్ బస్సులో తల్లీకూతుళ్లపై లైంగిక దాడికి దిగడంతో వారిద్దరు బస్సులోంచి దూకేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కూతురు మరణించింది.

కూతురు మరణంపై సుర్జీక్ సింగ్ రాఖ్రా వివాదాస్పద వ్యాఖ్య చేశారు. లైంగిక దాడి ఓ ప్రమాదమని, అమ్మాయి మృతి దైవసంకల్పమని మంత్రిగారు వాక్రుచ్చారు. ప్రమాదాలను ఎవరూ నివారించలేరని, ఏది జరగాలో అది జరుగుతుందని, భవిష్యత్తులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని, ప్రకృతికి ఎదురొడ్డలేమని, అది ప్రమాదం గానీ మరేదైనా గానీ అని మంత్రి అన్నారు.

Moga molestation case: Punjab minister rakes up controversy, says death of teen is ‘God's will’

తమ డిమాండ్లను అంగీకరించే వరకు తమ కూతురి శవానికి అంత్యక్రియలు చేయబోమని తండ్రి సుఖదేవ్ సింగ్ పట్టుబడుతున్నారు. తమకు రూ. 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, గాయపడిన మహిళకు ఉచిత వైద్యం అందించాలని, ఆర్బిట్ ఏవియేషన్ బస్సుల రూట్ పర్మిట్లను రద్దు చేయాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రతి రోజూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయని, బస్సులు, లారీలు, ఆటోలు... అంతెందుకు విమానాలు కూడా కూలిపోతుంటాయని, ఇది కూడా అలాంటిదేనని మంత్రిగారు అన్నారు. ప్రమాదాలు చాలా జరుగుతుంటాయని, బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారమేదో ఇచ్చేస్తే సరిపోతుందని, కోర్టుకు వెళ్లకుండా ఆ పరిష్కారం చేసుకుంటే సరిపోతుందని ఆయనగారు అన్నారు.

మెగా సంఘటనపై కాంగ్రెసు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నారు. శుక్రవారం నాడు వారు ఆందోళన చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+