పనుందని గెస్ట్‌హౌజ్‌కు పిలిచి మహిళపై రేప్ చేశాడు

 Mohali man booked for rape
మొహాలీ: తెలిసిన మహిళను పనుందని గెస్ట్‌హౌజ్‌కి పిలిచి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. అక్టోబర్ 9న హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని పర్వానూ పట్టణంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని సుఖ్వీందర్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం.. అక్టోబర్ 9న పని ఉందని బాధిత మహిళను గెస్ట్‌హౌజ్‌కు సుఖ్వీందర్ సింగ్ పిలిపించుకున్నాడు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా లోపలికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

కాగా, ఆ తర్వాత రేప్ విషయాన్ని తానే బయటపెడతానని బెదిరింపులకు దిగి మరోసారి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధిత మహిళ తన తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. బాధితురాలితో కలిసి ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఫేజ్ 11 పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదైంది.
బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

నిందితుడు మొహాలీలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడని, అతడు డ్రగ్స్ బానిస అయ్యాడని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలోనూ నిందితుడు మద్యం, డ్రగ్స్ సేవించి ఉన్నాడని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు మొహాలీ ఎస్పీ హార్పాల్ సింగ్ తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్లకు నిందితుడి ఫొటోను పంపించినట్లు తెలిపారు.

గిరిజన అమ్మాయిపై రేప్

ముంబై: తల్లిదండ్రులు ఓటే వేయడానికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ గిరిజన బాలికపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ధులే జిల్లాలోని శిర్పూరు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమ్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ గిరిజన కుటుంబానికి చెందిన భార్యాభర్తలు ఎనిమిదేళ్ల కూతురును ఇంట్లో ఉంచి ఓటు వేసేందుకు వెళ్లారు.

అదను కోసం వేచివున్న నిందితుడు ఇంట్లోని బాలికను బలవంతంగా బయటికి తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను తీవ్రంగా గాయపర్చి పరారయ్యాడు. కాగా, ప్రస్తుతం బాధితురాలు ధులే జిల్లా ఆస్పత్రిలో చికిత్ప పొందుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+