భగతవ్ చెప్పినట్టు, కుల నిర్మూలన జరగాలి: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్
సమాజంలో కులం ఆధారంగా వివక్ష కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీనికి పుల్ స్టాప్ పెట్టాలని చాలా మంది కోరుతున్నారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా దీనికి చరమగీతం పాడాలని కోరారు. ఆ కామెంట్లకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మద్దతు తెలిపారు. ఈ అంశంపై భగవత్ మంచి స్టాండ్ తీసుకున్నారని పేర్కొన్నారు.
అంతేకాదు కామెంట్స్ చేయడం కాదు అదీ కార్యరూపం దాల్చాలని కూడా పవర్ హితవు పలికారు. ఎప్పుడైతే వాస్తవరూపం దాల్చాలని కోరారు. లేదంటే ఇదీ మరో హామీగానే మిగులుతుందని అభిప్రాయపడ్డారు.

శుక్రవారం నాగ్‌పూర్‌లో జరిగిన పుస్తకావిష్కరణ సభలో మోహన్ భగవత్ ఈ కామెంట్స్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలోనే కాదు.. రాజకీయంగా కూడా చర్చకు దారితీసింది. 21వ శతాబ్దంలో కుల వ్యవస్థకు ప్రాధాన్యం లేదని.. అందరు ఒక్కటేనన్నారు. సామాజిక సమానత్వం అనేది భారతీయ సంప్రదాయం, సంస్కృతిలో అంతర్భాగం అని చెప్పారు.
వర్ణ, జాతి అనే వివక్షకు స్థానం లేదని చెప్పారు. వైదిక గ్రంథాలు, ఆధ్యాత్మిక, మత పెద్దలు అసమానతలను విడనాడి, వాస్తవికత గురించి తెలియజేశారని పేర్కొన్నారు. అంటరానితనం అనే భావన ఆచరణలో భాగం కాదని పేర్కొన్నారు.
కుల వ్యవస్థ మూలాలు, సమాజాన్ని ఏ విధంగా దోపిడికి దారితీసిందనే అంశాన్ని భగవత్ ప్రస్తావించారు. సామాజిక ఐక్యతను హాని కలిగించే అంశాలను తొలగించాలని కోరారు. మన పూర్వీకుల ద్వారా తప్పు జరిగిందని.. కానీ దానిని పునరావృతం కానీయరాదని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications