మావాళ్లు తలచుకున్నారంటే.: RSS చీఫ్ మాస్ వార్నింగ్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్.. నిప్పులు చెరిగారు. ఘాటు వార్నింగ్ ఇచ్చారు. కోట్లమంది హిందువులు తలచుకుంటే ఎవ్వరూ నిలవలేరని తేల్చి చెప్పారు. ప్రపంచం మొత్తం వారికి బాసటగా నిలుస్తుందని, మద్దతు పలుకుతుందని అన్నారు. బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న మైనారిటీలు.. ముఖ్యంగా హిందువులపై ఇటీవల జరుగుతున్న హింసాకాండను ఆయన ప్రస్తావించారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదని అన్నారు.

ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ లో పలువురు హిందువులపై జరిగిన ప్రాణాంతక దాడులపై మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తోన్న హిందువుల స్థితిగతుల గురించి మాట్లాడారు. బంగ్లాదేశ్ లో కోటిన్నర మందికి పైగా హిందువులు ఉన్నారని, వారంతా తమ హక్కుల కోసం నిలబడి పోరాడాలని నిర్ణయించుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వారికి మద్దతు ఇస్తారని స్పష్టం చేశారు.

Mohan Bhagwat RSS Chief Says If 1 25 Cr Bangladesh Hindus Stay and Fight for Rights World will Support

ముంబైలో ఆరెస్సెస్ నిర్వహించిన ఉపన్యాస మాలలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ముంబైలోని నెహ్రూ సెంటర్‌లో ఏర్పాటు చేసిన 'వందేళ్ల సంఘ్ ప్రయాణం: కొత్త హారిజోన్స్' పేరుతో జరిగిన రెండు రోజుల ఉపన్యాస మాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి తాజాగా మోహన్ భగవత్ హాజరయ్యారు. ప్రసంగించారు. అనేక అంశాల గురించి ప్రస్తావించారు.

అదే సమయంలో బంగ్లాదేశ్ లో హిందువులపై కొనసాగుతున్న మారణకాండ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ నివసించే హిందువులందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశీయ సమస్యలపై మాట్లాడిన భగవత్.. భారత జనాభా తీరు మార్పును పరిష్కరించడంలో పూర్వ ప్రభుత్వాలు విఫలమయ్యాయని అభిప్రాయపడ్డారు. జననాల రేటు, అక్రమ వలసలు ప్రధాన కారణాలని అన్నారు.

గతంలో జనాభా మార్పులపై ప్రభుత్వం సరిగా దృష్టి పెట్టలేదని, ఇప్పుడు చర్యలు ప్రారంభించిందని గుర్తు చేశారు. ఇది- విజయవంతమౌతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ నువిడదీయడం ఇకపై అసాధ్యమని మోహన్ భగవత్ తేల్చి చెప్పారు. ఇప్పుడు భారతదేశాన్ని విడగొట్టడం సాధ్యం కాదని, అలాంటి ప్రయత్నాలకు దిగినవారే విచ్ఛిన్నమౌతారని హెచ్చరించారు. ఆరెస్సెస్ కార్పొరేట్ లేదా సంస్థాగత నిధులపై ఆధారపడదని భగవత్ వివరణ ఇచ్చారు. నిధులు కార్యకర్తల నుండే సేకరిస్తామని తెలిపారు.

కుల వ్యవస్థపై ఆర్ఎస్ఎస్ వైఖరిని ఈ సందర్భంగా మోహన్ భగవత్ కుండబద్దలు కొట్టారు. ఆర్ఎస్ఎస్ ఏరకంగా కూడా వివక్ష చూపదని తెలిపారు. ఎవరైనా ఏ కులం వారైనా ఆరెస్సెస్ చీఫ్ కావచ్చని వ్యాఖ్యానించారు. ఎస్సీ- ఎస్టీ అనేది అనర్హత కాదని, అలాగే బ్రాహ్మణుడు కావడం కూడా అర్హత కాదని అన్నారు. ఆరెస్సెస్ మొదట బ్రాహ్మణులతో ప్రారంభమైనప్పటికీ, తాము అన్ని కులాల కోసం పనిచేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+