మొదట మీరు 10 మంది పిల్లల్ని కనండి: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: హిందువులను రెచ్చగొడుతున్న రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ మొదట తానే పది మంది పిల్లలను కనాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

హిందువులను ఎక్కువ పిల్లలను కనమని చెబుతున్న మోహన్ భాగవత్ ఆ పని ఎందుకు చేయడం లేదని అభిప్రాయపడ్డారు. ఆయనే మొదట ఆ పని చేయాలన్నారు. పది మంది పిల్లలకు జన్మను ఇచ్చి వారిని బాగా పెంచి పెద్ద చేయాలన్నారు.

తన ప్రకటనను మోహన్ భాగవత్ ఆచరణలో చూపాలన్నారు. ఆ తర్వాత ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలన్నారు. అరవింద్ కేజ్రీవాల్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో మోహన్ భాగవత్‌కు సూచన చేశారు.

Mohan Bhagwat

మోహన్ భాగవత్ ఇటీవల మాట్లాడుతూ.. హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనవద్దని ఏ చట్టం చెబుతోందని ప్రస్నించారు. అలాంటి చట్టం ఏమీ లేదన్నారు.

ఇతరులు తమ జనాభాను పెంచుకుంటున్నప్పుడు మనకు అడ్డు ఏమిటన్నారు. ఇది సిస్టంకు సంబంధించినది కాదన్నారు. అయితే మోహన్ భాగవత్.. హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనవచ్చునని అభిప్రాయపడ్డారు. కానీ దీనిపై కేజ్రీవాల్ విమర్శలు చేయడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+