మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్: ఎట్టకేలకు తేల్చారు
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. బీజేపీ సీనియర్ నేత మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. సోమవారం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశం అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. యాదవ వర్గానికి చెందిన ఓబీసీని బీజేపీ అధిష్టానం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2013లో ఎమ్మెల్యేగా మొదటి ఎన్నికతో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆయన ఎన్నికయ్యారు.

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో జులై 2, 2020న క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుంచి రాష్ట్ర రాజకీయ దృశ్యంలో యాదవ్ ప్రభావం మరింత పటిష్టమైంది. మూడుసార్లు ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికైన మోహన్ యాదవ్ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపడంతో కీలక పదవి ఆయనను వరిచింది.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడిచిన విషయం తెలిసిందే. సుదీర్ఘ తర్చనభర్జనల అనంతరం మోహన్ యాదవ్ ఎంపిక జరిగింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ను కొనసాగిస్తారని అనుకున్నప్పటికీ.. బీజేపీ అధిష్టానం మాత్రం సీఎం మార్పునకే మొగ్గుచూపింది.
#WATCH | BJP leaders including Shivraj Singh Chauhan, congratulate party leader Mohan Yadav after he was named as the new Chief Minister of Madhya Pradesh pic.twitter.com/SibAIt4Cnh
— ANI (@ANI) December 11, 2023
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చేందుకు హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్, తెలంగాణ నుంచి ఎంపీ, బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆ తర్వాత బీజేపీ అధిష్టానంతో సంప్రదింపులు జరిపి మోహన్ యాదవ్‌ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. కొత్త సీఎంగా ఎంపికైన మోహన్ యాదవ్‌కు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఇతర బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు.

బీజేపీతో సుదీర్ఘ అనుబంధం
1965 మార్చి 25న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జన్మించిన మోహన్ యాదవ్ సుదీర్ఘ కాలం నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు. రాజకీయ ప్రయత్నాలతో పాటు వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు పొందారు. ఇటీవలి 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో, మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చేతన్ ప్రేమనారాయణ్ యాదవ్‌పై 12,941 ఓట్ల తేడాతో విజయం సాధించి తన స్థానాన్ని విజయవంతంగా కాపాడుకున్నారు. ఈ విజయంతో 95,699 ఓట్లు సాధించి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా నిలిచారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ
ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాదాపు ఏకపక్ష విజయం సాధించింది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గానూ 163 సీట్లలో బీజేపీ విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ పార్టీకి 66 సీట్లు, ఇతరులు 1 స్థానం నుంచి గెలుపొందారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications