మరికొన్ని గంటల్లో కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు..
గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో నైరుతు రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. దేశంలో గత వ్యవసాయ భూములు సగం నైరుతి రుతుపవనాల మీదే ఆధారపడి ఉన్నాయి. ప్రతి సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే వర్షాలే ఈ పంటలకు ఆధారం. అందుకే మన దేశంలో ఈ రుతుపవనాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.
నైరుతి రుతుపవనాలు ఈ సారి ఒక రోజు ముందుగానే అంటే మే 31వ తేదీన కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ సంస్థ ఆదివారం వెల్లడించింది. సోమవారం రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడనున్నట్లు అంచనా వేసింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కానుందని గత నెలలోనే వాతావరణ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే.

కరోనా విలయ తాండవం చేస్తోన్న వేళ.. రుతు పవనాల రాక తీపి కబురు కానుంది. ఎందుకంటే వేసవిలోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. అక్టోబర్‌లో థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సరయిన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు జనానికి ఇబ్బందులు తప్పవు. రుతుపవనాల రాకతో.. వాతావరణం చల్లబడి.. వైరస్ ప్రభావం కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications