వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హమ్మయ్యా: యూఏఈ నుంచి కేరళకు రెండు విమానాలు, అటు నుంచే క్వారంటైన్‌కు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు ఎట్టకేలకు స్వదేశం చేరుకున్నారు. విదేశాల్లో ఉన్న భారతీయులు.. స్వదేశం వచ్చేందుకు చార్జీ, క్వారంటైన్ ఖర్చులు పెట్టుకుంటే.. వచ్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో యూఏఈ నుంచి రెండు ఎయిర్ ఇండియా విమానాలు కేరళ చేరుకున్నాయి. గురువారం రాత్రి కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో విమానాలు ల్యాండయ్యాయి.

Recommended Video

Vande Bharat Operation: Special Flights with Indian Nationals From UAE Landed at Kochi
 More than 360 Indians from UAE Land in Kerala..

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్లైట్ 452 విమానంలో 177 మంది ప్రయాణికులు, నలుగురు చిన్నారులతో కోచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి 10.09 నిమిషాలకు ల్యాండయ్యింది. మరో విమానం 177 ప్రయాణికులు ఐదుగురు చిన్నారులతో కలిసి దుబాయ్ నుంచి వచ్చింది. కోజికోడ్ ‌లో రాత్రి 10.45 గంటలకు దిగింది. రెండు విమానాల్లో 363 మంది ప్రయాణికులు తిరిగి స్వదేశం చేరుకున్నారు. వారందరినీ వారి జిల్లాల్లో క్వారంటైన్ చేస్తామని కేరళ ప్రభుత్వం స్పష్టంచేసింది.

విదేశాల్లో ఉన్న భారతీయులను దేశం రప్పించేందుకు వందే భారత్ మిషన్ అనే పేరు పెట్టారు. తొలుత కేరళకు రెండు విమానల్లో ప్రయాణికులు వచ్చారు. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా సింగపూర్ ప్లైట్ పంపించింది. ఆ విమానం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు భారత్ చేరుకోనుంది. విమానంలో 14 మందిని సింగపూర్ తీసుకెళ్లి.. భారత్‌కు ఎన్ఆర్ఐలను తీసుకొస్తుంది.

English summary
first Air India Express flight carrying Indian citizens from Abu Dhabi in the United Arab Emirates landed at the airport in Kozhikode on Thursday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X