బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హమ్మయ్యా.. తప్పిన ప్రమాదం.. 400 మంది సేఫ్..

|
Google Oneindia TeluguNews

బెంగళూరులో విమానాశ్రయంలో ఇండిగో విమానాలు భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. జనవరి 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానాలు గాల్లో ఉండగానే ఒకదానికొకటి ఢీకొట్టే ముప్పును రాడార్ కంట్రోలర్ సకాలంలో గుర్తించడంతో తప్పింది. విమానాశ్రయం నుంచి బయలుదేరిన తర్వాత బ్రీచ్ ఆఫ్ సెపరేషన్ గురించి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు తెలియజేయలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

విమానాశ్రయం నుంచి బయలుదేరిన రెండు విమానాలు గగనతలంలో కనీస నిలువు లేదా క్షితిజ సమాంతర దూరాన్ని దాటినప్పుడు బ్రీచ్ ఆఫ్ సెపరేషన్ జరుగుతుంది. ఇండిగోకు చెందిన బెంగళూరు- కోల్‌కతా విమానం 6E 455, బెంగళూరు-భువనేశ్వర్ 6E 246 విమానం త్రుటిలో ప్రమాదం తప్పించుకున్నాయని తెలిపారు.

More Than 400 Lives Were At Risk After Bengaluru Take-Off

బెంగళూరు విమానాశ్రయంలో ఉత్తర, దక్షిణ రన్‌వేలు ఉన్నాయి. జనవరి 9న ఉదయం నార్త్ రన్‌వే నుంచి టేకాఫ్ కాగా.. సౌత్ రన్‌వేలో ల్యాండింగ్‌కు అనుమతించినట్టు డీజీసీఏ పేర్కొంది. రన్‌వే ఆపరేషన్స్ షిఫ్ట్ ఇంఛార్జ్ మాత్రం కేవలం నార్త్ రన్‌వేను మాత్రమే టేకాఫ్, ల్యాండింగ్‌కు వినియోగించాలని నిర్ణయించారు. సౌత్ రన్‌వే మూసివేసినా.. ఈ సమాచారం సౌత్ టవర్ కంట్రోలర్‌కు తెలియజేయలేదు. ఈ విషయం తెలియని సౌత్ కంట్రోలర్ బెంగళూరు-కోల్‌కతా విమానం టెకాఫ్‌కి అనుమతించారు.

నార్త్ టవర్ కంట్రోలర్ బెంగళూరు-భువనేశ్వర్ విమానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విమానాలకు క్లియరెన్స్ విషయంలో ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో ఒకదానికొకటి దగ్గరగా వచ్చినట్టు ప్రాథమిక నివేదిక పేర్కొంది. బయలుదేరిన తర్వాత రెండు విమానాలు పక్కపక్కనే దగ్గరగా వెళుతున్న విషయాన్ని గ్రహించిన రాడార్ కంట్రోలర్ అలర్ట్ చేయడంతో గాల్లో ఢీకొట్టే ముప్పు తప్పింది. ఈ విషయాన్ని ఏ లాగ్‌బుక్‌లోనూ రికార్డు చేయడం లేదా ఏఏఐకి నివేదించలేదు. అయితే, ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఓ అధికారి పేర్కొన్నారు.

English summary
A mid-air collision between two IndiGo flights that took off from Bengaluru airport was averted after a radar controller saw the impending danger and took corrective actions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X