ఢిల్లీ కంటోన్మెంట్‌లో రావత్ దంపతుల అంత్యక్రియలు.. ఏర్పాట్లు పూర్తి
ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. రేపు సాయంత్రం ఆర్మీ విమానంలో ఢిల్లీకి పార్థివదేహాలు తరలిస్తారు. గురువారం ఢిల్లీలోని నివాసంలో ఉదయం గం.11 నుంచి మధ్యాహ్నం గం.2ల వరకు నివాళులర్పించేందుకు ప్రజలకు అనుమతి ఇచ్చారు. కామరాజ్ మార్గ్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతంలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమ యాత్ర.
తమిళనాడులోని కూనూర్‌లో భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17వీ5 హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనలో మరణించిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ అవశేషాలను ఢిల్లీకి తరలిస్తారు.

ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. రేపు సాయంత్రం ఆర్మీ విమానంలో ఢిల్లీకి పార్థివదేహాలు తరలిస్తారు. గురువారం ఢిల్లీలోని నివాసంలో ఉదయం గం.11 నుంచి మధ్యాహ్నం గం.2ల వరకు నివాళులర్పించేందుకు ప్రజలకు అనుమతి ఇచ్చారు. కామరాజ్ మార్గ్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతంలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమ యాత్ర చేస్తారు.
Recommended Video
కోయంబత్తూర్ నుంచి వెల్లింగ్టన్ వెళుతుండగా హెలికాఫ్టర్ కుప్పకూలడంతో 13 మంది ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రస్తుతం వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఐఏఎఫ్ పేర్కొంది. సీడీఎస్ బిపిన్ రావత్ మృతి, హెలికాఫ్టర్ ప్రమాదంపై ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశమైంది. హెలికాప్టర్ ప్రమాద ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ రేపు పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్నారు.












Click it and Unblock the Notifications