5వేల కోసం కొడుకుని తాకట్టు పెట్టిన తండ్రి, విడుదల కోసం ఎదురుచూపు
హర్దా: కన్న తండ్రే కుమారుడిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్న సంఘటన ఇది. వివరాలిలా ఉన్నాయి. రూ. 5000, 600 కేజీల గోధమ పిండి కోసం కుమారుడినే తాకట్టు పెట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లోని హర్దా గ్రామంలో చోటుచేసుకుంది.
హర్దాకు చెందిన భగీరథ్(55) తన కుమారుడు సంత్రమ్ (14)ని 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు స్ధానిక వ్యాపారి కన్హయ్యా లాల్ భండారి దగ్గర రూ. 5000, 600 కేజీల గోధుమ పిండి కోసం తాకట్టు పెట్టాడు.
సంత్రమ్‌కి 14 సంవత్సరాలు వచ్చినా తన కుటుంబం తీసుకున్న అప్పుని తీర్చడానికి రోజూ 12 గంటలు శ్రమించాల్సి వస్తుంది. ఇందుకు గాను వ్యాపారి సంవత్సరానికి 100 కేజీల గోధుమ పిండిని సంత్రమ్ కుటుంబానికి ఇస్తున్నాడు.

తనని ఎప్పుడు వదిలిపెడతారని వ్యాపారని అడిగితే, తన కుటుంబం తీసుకున్న అప్పు చాలా ఉందంటూ యజమాని వదిలిపెట్టడం లేదని అంటున్నాడు. తను చనిపోయేంత వరకు పని చేస్తూనే ఉండాలని యజమాని చెప్తున్నాడంటూ సంత్రమ్ మీడియా ముందు వాపోయాడు.
దీంతో యజమాని కన్హయ్య ఇంటికి చేరుకున్న మీడియా ఈ విషయమై ప్రశ్నించగా తీసుకున్న సంత్రమ్ తండ్రి తీసుకున్న అప్పు తీర్చకుండానే ఒక సంవత్సరం పనిచేసి వెళ్లిపోయాడని, ఈ విషయం వాళ్ల తండ్రి ద్వారానే చెప్పిస్తానని యజమాని పేర్కొన్నారు.
హర్దా గ్రామంలో ఉన్న కోర్కు, గోండ్ గిరిజన తెగకు చెందిన ఎంతో మంది చిన్నారులు కుటుంబ పోషణ కోసం బందీ కార్మికులుగా పని చేస్తున్నారని గ్రామ అధికారి తెలిపారు. అదే గ్రామంలో మరో యజమాని వద్ద పని చేస్తున్న కమల్ అనే బాధితుడు మీడియాతో మాట్లాడుతూ నా తండ్రి నన్ను తాకట్టు పెట్టి, అప్పుగా తీసుకున్న డబ్బుతో ఆల్కహాల్ కొనుగోలు చేసేవాడని వాపోయాడు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications