సంభాల్‌లో మసీదు సర్వే: హింసాత్మక ఘటనల్లో ముగ్గురు మృతి, అధికారులు, పోలీసులకు గాయాలు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్‌లో ఆదివారం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మొఘల్ కాలం నాటి జామా మసీదుపై కోర్టు సర్వే కు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్వే కోసం వచ్చిన అధికారులపై స్థానికులు రాళ్లు, చెప్పులతో దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురు అధికారులు, పోలీసులకు గాయాలయ్యాయి.
ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మసీదు హిందూ దేవాలయంపై నిర్మించారనే వాదనలతో కోర్టు ఈ సర్వేకు ఆదేశించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్వకేట్ కమినర్ నేతృత్వంలోని బృందం తన పని ప్రారంభించే సమయంలో మసీదు సమీపంలో స్థానికులు గూమిగూడి రాళ్ల దాడి చేశారు.

మసీదులోకి అధికారులు, పోలీసులు ప్రవేశించకుండా రాళ్లు, చెప్పులతో దాడులకు పాల్పడ్డారు. దాదాపు 1000 మంది గూమిగూడి పోలీసులు, అధికారులపై రాళ్ల దాడి చేశారు. పదికిపైగా వాహనాలకు నిప్పుపెట్టారు. స్థానికంగా ఉన్న నివాసాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు.ఈ నేపథ్యంలో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేయడంతోపాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఈ హింసాత్మక ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని 30 మంది పోలీసులకు, పలువురు అధికారులకు గాయాలయ్యాయని స్థానిక పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైన సర్వే, మంగళవారం కూడా కొనసాగనుండటంతో సంభాల్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా ఆదివారం అధికారులు సర్వే పూర్తి చేశారు.
ప్రస్తుతం రాళ్లదాడి, హింసాత్మక ఘటనలకు పాల్పడిన 22 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయవాది విష్ణుశంకర్ జైన్ మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల మేరకు వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ ద్వారా సర్వే బృందం సైట్ వివరణాత్మక పరిశీలనను నిర్వహించిందన్నారు. నవంబర్ 29లోగా సర్వే నివేదిక అందజేయాల్సి ఉందని తెలిపారు. అయితే, ఈ హింసాత్మక ఘటనలకు బీజేపీనే కారణమని మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. మరోవైపు, సమాజ్ వాదీ పార్టీ గూండాలే ఈ దాడులకు పాల్పడ్డారని బీజేపీ కౌంటర్ ఇచ్చింది.
#WATCH | Sambhal, Uttar Pradesh: Houses were damaged and stones scattered on the streets where an incident of stone pelting took place when a survey team arrived at the Shahi Jama Masjid to conduct a survey of the mosque. pic.twitter.com/pPoMP0f8zi
— ANI (@ANI) November 24, 2024
కాగా, 1529లో మొఘల్ చక్రవర్తి బాబర్ ఇక్కడున్న ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు బాబార్నామా, ఐన్ఏ అక్బరీ వంటి చారిత్ర గ్రంథా్లో ఉన్నట్లు పిటిషనర్లు వాదించారు. చారిత్రక నిజాలను వెలికితీసేందుకు సర్వే నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అయితే, మరో వర్గం మాత్రం 1991 ప్రార్థనా స్థలా చట్టం ప్రకారం.. సర్వే మత పవిత్రతను ఉల్లంఘించేలా ఉందని ఆరోపిస్తోంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications