వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీమిండియాగా పనిచేద్దాం: మోడీ, పక్కపక్కనే కెసిఆర్, బాబు (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశం అభివృద్ధి చెందాలంటే ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ది చెందుతుందని, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే కొత్త వ్యవస్థ ఏర్పాటు జరగాలని మోడీ అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ విషయం చెప్పారు.

కేంద్ర ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసే అంశంపై మోడీ ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయటం తెలిసిందే. టీం ఇండియాగా పనిచేద్దామని, టీమిండియా అంటే ప్రధాని-కేంద్ర మంత్రులు, ప్రధాని- రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని-కేంద్ర, రాష్ట్ర అధికారులు అని మోడీ ప్రధాని చెప్పారు. వీరంతా కలిసి పని చేస్తేనే దేశం, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

సహకార ఫెడరిలిజం కోసం కొత్త వ్యవస్థ ఏర్పాటు తప్పదన్నారు. ప్రణాళికా సంఘం అవసరాన్ని పలుమార్లు ప్రశ్నించటం జరిగిందని చెప్పారు. ప్రణాళికా సంఘం అవసరం ఉందా? లేదా? అనేది మొదటిసారి 1992లో ఆర్థిక సంస్కరణల సందర్భంగా చర్చించటం జరిగిందన్నారు. రెండోసారి 2012లో పార్లమెంటు సలహా సంఘం ఈ అంశాన్ని పరిశీలించిందని ప్రధాని చెప్పారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ప్రణాళికా సంఘం కొనసాగింపును పరిశీలించాల్సిన అవసరం ఉందని తన పదవీ కాలం ముగింపు సమయంలో అభిప్రాయపడ్డారని మోడీ సూచించారు.

ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గుర్తించానని చెప్పారు. ఇప్పుడు భివృద్ది లక్ష్యంగా పని చేస్తున్నాం కాబట్టి ఈ లక్ష్య సాధన కోసం ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకోవలసిందేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, దీని కోసం ప్రణాళికా ప్రక్రియ పైనుండి కిందికి కాకుండా కింది నుండి పై స్థాయికి జరిగే విధంగా ఉండాలని మోడీ స్పష్టం చేశారు.

మోడీ-పక్కపక్కనే కెసిఆర్, బాబు

మోడీ-పక్కపక్కనే కెసిఆర్, బాబు

దేశం అభివృద్ధి చెందాలంటే ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ది చెందుతుందని, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే కొత్త వ్యవస్థ ఏర్పాటు జరగాలని మోడీ అభిప్రాయపడ్డారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ విషయం చెప్పారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

కేంద్ర ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసే అంశంపై మోడీ ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయటం తెలిసిందే.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

టీం ఇండియాగా పనిచేద్దామని, టీమిండియా అంటే ప్రధాని-కేంద్ర మంత్రులు, ప్రధాని- రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని-కేంద్ర, రాష్ట్ర అధికారులు అని మోడీ ప్రధాని చెప్పారు. వీరంతా కలిసి పని చేస్తేనే దేశం, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రులు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు సముచిత ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రుల సమావేశం సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. ప్రణాళికా సంఘం రూపురేఖలు మార్చాలని సృజనాత్మకంగా ఆలోచించి ఫెడరల్ విధానాన్ని మరింత పటిష్టం చేసేదిగా కొత్త వ్యవస్థ ఉండాలని మోడీ అభిప్రాయపడ్డారు. మోడీ ప్రతిపాదనకు తెలంగాణ సిఎం చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబునాయుడు లతోపాటు ఎక్కువమంది సిఎంలు మద్దతు తెలిపారు.

English summary
A majority of chief ministers on Sunday favoured Prime Minister Narendra Modi’s proposal to replace the existing Planning Commission with another institution that would reflect a truly federal polity and a changed economic scenario, and which recognises states’ need for flexibility in spending.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X