అత్యంత కీలక బడ్జెట్.. 1991 తర్వాత తొలిసారి, కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ
1991 తర్వాత అత్యంత కీలక బడ్జెట్ 2021-22 అని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ అన్నారు. గత మూడేళ్లుగా జీడీపీ క్షీణిస్తూ వస్తోందని ఆయన అన్నారు. జీడీపీ 37వ నెలలో పడిపోయిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని గమనించి నిర్మలా సీతారామన్ సీరియస్‌గా ఉండి ఉంటారని తెలిపారు. ఆర్థికసర్వే బడ్జెట్‌ను ప్రతిబింబిస్తోందని వివరించారు. పార్లమెంట్‌లో సీతరామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మనీశ్ తివారీ కామెంట్ చేశారు. ఆమె వరసగా మూడోసారి బడ్జెట్ సమర్పిస్తోన్న సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ క్రైసిస్ నేపథ్యంలో గతేడాది లాగానే బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఆర్థిక సర్వేలో ఆర్థిక వృద్ది 11 శాతం ఉంటుందని పేర్కొన్నది. వైద్యం, ఉపాధికి ప్రయారిటీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పన, మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, మేకిన్ ఇండియా, స్వయం ఉపాధికి భారీగా కేటాయింపులు చేసే అవకాశం ఉంది.

ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో రాష్ట్రపతి కోవింద్ చదివే సమయంలో ప్రతిపక్షాలు బాయ్ కాట్ చేశారు. బడ్జెట్ నేపథ్యంలో మాత్రం సభలో ఉండి.. లోపాలను ఎత్తి చూపుతారు. కేటాయింపులపై పెదవి విరిచే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications