పెళ్లి కోసం అప్పులు చేశాడు. ఆంటీ, కూతుర్ని ఏం చేశాడంటే ?, అందరిముందు అలాగే ?

బెంగళూరు/మైసూరు: గ్రాండ్ గా వివాహం చేసుకోవాలని అనుకున్న వ్యక్తి తెలిసినవాళ్ళ దగ్గర అప్పు చెయ్యడానికి సిద్దం అయ్యాడు. తెలిసిన వాళ్ల దగ్గర పెళ్లి కొడుకు అప్పులు చేశాడు. ఇదే సమయంలో సొంత ఊరిలో నివాసం ఉంటున్న ఓ ఆంటీ దగ్గర పెళ్లికొడుకు అప్పు చేశాడు. పెళ్లి చేసుకున్న వ్యక్తి సరైన సమయంలో ఆంటీకి డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయాడు. ఇదే సందర్బంలో ఆంటీ, ఆమె కూతురిని కొడవలితో నరకడం కలకలం రేపింది.

కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని హణసూరు తాలుకాలోని గంగేనహళ్లిలో దేవరాజ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇదే ఊరులో రాధా (52) అనే మహిళ ఆమె కుమార్తె సంగీతా నివాసం ఉంటున్నారు. దేవరాజ్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. సొంత ఊరిలో, పక్క గ్రామాల్లో నివాసం ఉంటున్న తెలిసిన వాళ్లు, బంధువుల దగ్గర అప్పులు చేసిన దేవరాజ్ గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు.

Mother and daughter were attacked with a machete after asking to return the loan taken for marriage

తాను పెళ్లి చేసుకుంటున్నానని, మీరు అప్పుగా డబ్బులు ఇవ్వాలని దేవరాజ్ అతను నివాసం ఉంటున్న గ్రామంలోనే ఉంటున్న రాధా ఆంటీని అడిగాడు. రాధా దగ్గర దేవరాజ్ డబ్బు అప్పుగా తీసుకున్నాడు. పెళ్లి చేసుకున్న దేవరాజ్ కొంతకాలం తరువాత రాధా ఆంటీకి కొంత డబ్బులు మాత్రమే తిరిగి ఇచ్చాడు. అయితే డబ్బు తీసుకుని చాలా కాలం అయినా దేవరాజ్ డబ్బులు ఇవ్వకపోవడంతో రాధా అతన్ని ప్రశ్నించింది.

కొన్ని రోజుల తరువాత ఇస్తాను, వచ్చే నెల ఇస్తాను తరువాత ఇస్తాను అంటూ దేవరాజ్ ఇన్ని రోజులు కాలం గడిపేస్తూ వచ్చాడు. అయితే ఎంతకాలం అయినా దేవరాజ్ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో సోమవారం రాత్రి రాధా అతని ఇంటి దగ్గరకు వెళ్లింది. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని దేవరాజ్ ను రాధా ఆంటీ నిలదీసింది. ఆ సందర్బంలో దేవరాజ్, రాధాల మధ్య మాటమాట పెరిగింది. ఆ సందర్బంలో దేవరాజ్ డబ్బు అప్పు ఇచ్చిన రాధా ఆంటీ బట్టలు లాగడానికి ప్రయత్నించి అసభ్యంగా ప్రవర్తించాడని తెలిసింది.

Mother and daughter were attacked with a machete after asking to return the loan taken for marriage

ఆ సందర్బంలో దేవరాజ్ బంధువులు అయిన శీనప్ప, శంకరప్ప, బోరమ్మ. దేవరాజ్ కలిసి రాధాను చితకబాదేశారు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన దేవరాజ్ ఇంట్లో ఉన్న కొడవలి తీసుకుని వచ్చి నానా హంగామా చేశాడు. అదే సందర్బంలో తల్లి రాధాను కాపాడుకోవడాకోవడానికి అక్కడికి వెళ్లిన సంగీతా మీద దేవరాజ్ కొడవలితో దాడి చేశాడు. డబ్బులు అప్పు ఇచ్చిన రాధా ఆంటీ మీద దేవరాజ్ అదే కొడవలితో దాడి చేశాడు.

తీవ్రగాయాలైన రాధా, ఆమె కూతురు సంగీతాను ఆసుపత్రికి తరలించారు. సంగీతా పరిస్థితి విషమంగా ఉందని, దాడి చేసిన వాళ్లు అందరూ పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. డబ్బులు అప్పు ఇచ్చిన పాపానికి తల్లీకూతురు మీద అప్పు చేసిన వ్యక్తి దాడి చెయ్యడం కలకలం రేపింది. సంగీతాను మైసూరు జిల్లా ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+