పది రోజుల్లో పెళ్లి.. కట్ చేస్తే.. కాబోయే అల్లుడితో అత్త జంప్
మూడు ముళ్లు బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే వేడుకే వివాహం. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. పెళ్లి తంతుతో కేవలం ఇద్దరు వ్యక్తులే కాకుండా వారి కుటుంబాలు సైతం ఒక్కటవతాయి. అందుకే పెళ్లి విషయంలో అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి అయినా కానీ మంచి సంబంధం ఫిక్స్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఓ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఇక వివాహానికి పది రోజులే సమయం ఉందనగా.. పెళ్లి శుభలేఖలు పంచేశారు.. పెళ్లి పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. అనుకోని సంఘటనతో వరుడు కుటుంబం, వధువు ఫ్యామిలీ అంతా షాక్ అవుతున్నారు.
కుమార్తె పెళ్లి అంటే అన్ని తానై చూసుకునే ఆమె తల్లి.. ఏకంగా కాబోయే వరుడితో జంప్ అయ్యింది. కాబోయే అల్లుడితో లేచిపోవడమే కాకుండా ఇంట్లోని రూ. 3.5 లక్షల నగదు, రూ. 5 లక్షల విలువైన బంగారు నగలను సైతం పట్టుకుపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పదిరోజుల్లో పెళ్లి జరగబోయే తరుణంలో అల్లుడితో అత్త జంప్ అవ్వడం ఏంటని హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఫుల్ వైరల్ గా మారింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పది రోజుల్లో కుమార్తె వివాహం జరగాల్సి ఉండగా, కాబోయే అల్లుడితో అత్త పరారైంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జితేంద్రకుమార్, అనిత దంపతులు నివసిస్తున్నారు. వారి కుమార్తె శివానీకి.. రాహుల్ అనే వ్యక్తితో ఏప్రిల్ 16న వివాహం నిశ్చయించారు. బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభలేఖలు పంచేశారు.
పెళ్లి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కానీ అనుకోని విధంగా శివానీ తల్లి అనిత కాబోయే అల్లుడు రాహుల్‌తో ఏప్రిల్ 6న పరారైంది. ఈ ఊహించని ఘటనతో ఇరు కుటుంబ సభ్యులే కాకుండా గ్రామస్థులు సైతం షాక్ అవుతున్నారు.
ఈ ఘటనపై శివానీ తండ్రి జితేంద్ర కుమార్ స్పందించారు. అల్లుడు తన కుమార్తెతో కాకుండా తన భార్యతో మాట్లాడేవాడని చెప్పారు. రోజులో 22 గంటలు ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని గమనించానని.. కానీ త్వరలో పెళ్లి జరగనుండటంతో ఏమీ అనలేకపోయానని అన్నారు. రాహుల్, అనిత ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నాయని తెలిపారు.

గత మూడు, నాలుగు నెలలుగా రాహుల్, తన తల్లి ఫోన్‌లో విపరీతంగా మాట్లాడుకుంటున్నారని పెళ్లికూతురు శివానీ చెబుతుంది. రూ. 3.5 లక్షల నగదు, రూ. 5 లక్షల విలువైన బంగారు నగలతో పారిపోయిందని వెల్లడించింది. ఇంట్లోంచి తీసుకెళ్లిన డబ్బు, బంగారు నగలు వెనక్కి ఇవ్వాలని శివానీ కోరింది.












Click it and Unblock the Notifications