కుటంబాన్ని బలి తీసుకున్న అనుమానం: అనాథగా మారిన చిన్నారి
బెంగళూరు: అక్రమ సంబంధంపై అనుమానం పెంచుకుని ఒక కుటుంబం బలి అయ్యి 8 నెలల పసికందు రోడ్డున పడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దులోని కోలారు జిల్లా శ్రీనివాసపురం దగ్గర జరిగింది. భార్య, బిడ్డను కోడవలితో హత్య చేసి తరువాత అతను పోలంలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 8 నెలల పాపను తీసుకోవడానికి ఇరు కుటుంబాల వారు ముందుకు రావడం లేదు.
శ్రీనివాసపురంలో నివాసం ఉంటున్న గంగాధర (35), శిడ్లఘట్ట తాలుకా దిబ్బూరు గ్రామానికి చెంిన శాంతమ్మ (23)లకు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వీరికి గజేంద్ర (3), 8 నెలల పాప ఉన్నారు. వివాహం అయిన రెండు సంవత్సరాల తరువాత గంగాధర, శాంతమ్మ ఒకరిమీద ఒకరు అనుమానం పెంచుకున్నారు.
దీనిపై పలుమార్లు వారి మధ్య గొడవలు జరిగేవి. పెద్దలు పలుమార్లు పంచాయితీ పెట్టినా దారికి రాలేదు. ఆ తర్వాత గంగాధర అతని సోంత గ్రామం అయిన మీనుగానహళ్ళికి కాపురం మార్చాడు.

కొన్ని నెలల క్రితం కాన్పు కోసం శాంతమ్మ పుట్టింటికి వెళ్లింది. ఇటీవలే భర్త ఇంటికి చేరుకునింది. మళ్లీ ఇద్దరి మద్య ఇదే గొడవ. మంగళవారం రాత్రి ఇదే విషయంలో ఇద్దరి మద్య గొడవ జరిగింది. ఇద్దరు వేరు వేరు గదులలో నిద్రపోయారు. మంగళవారం అర్దరాత్రి దాటిన తరువాత గంగాధర కొడవలి తీసుకుని భార్య శాంతమ్మ, కుమారుడు గజేంద్రను దారుణంగా హత్య చేశాడు.
8 నెలల పాపను మాత్రం అతను వదిలి పెట్టేశాడు. పాపను ఇంటిలోనే వదిలి పెట్టిన గంగాధర గ్రామం నుండి వెళ్లి అతని పోలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం గ్రామస్తులు విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ అజయ్ హిలోరి, డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.












Click it and Unblock the Notifications