ఇంటర్ చదువుతున్న కూతుర్ని చంపేసిన తల్లి ఏం చేసిందంటే?, ఎక్కడ చూసినా?

ఆ కుటుంబంలో తల్లి, కుమార్తె మాత్రమే ఆ ఇంటిలో నివసిస్తున్నారు. ఇటీవలే భర్తను కోల్పోయిన ఆ మహిళ తన కూతురిని చాలా ప్రేమగా చూసుకుంది. అయితే ఇప్పుడు ఆ ఇంటిలో ఎవ్వరూ ఊహించని విషాదం చోటుచేసుకుంది. 19 ఏళ్ల కుమార్తెను హత్య చేసిన తల్లి తరువాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. కన్నకూతురికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్న తల్లి చేతిలోనే ఆ కూతురు హత్యకు గురైయ్యింది.

ఇంటి గోడ మొత్తం రక్తం మరకలతో నిండిపోయింది. ఈ దృశ్యం చూస్తే గుండెల్లో గుబులు పుడుతుంది. 19 ఏళ్ల యువతి ఇంటి నేల మీద శవమై పడింది. తల్లీ, కూతురు రక్తపుమడుగులో పడిపోవడంతో ఆ ప్రాంతంలో కలకలం రూపింది. ఇదంతా చూసిన స్థానికులు మొదట ఎవరో దోపిడీ చెయ్యడానికి ప్రయత్నించారని కనిపిస్తోందని అనుకున్నారు. అయితే తీరా అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. సొంత కూతుర్ని ఆమె తల్లి చంపేసిందని వెలుగు చూసింది.

Mother who tried to commit suicide by stabbing her daughter to death in Bengaluru city

బెంగళూరు సిటీలోని బనశంకరిలోని శాస్త్రీ నగర్ లో సాహితీ (19) అనే యువతి నివాసం ఉంటున్నది. సాహితీ ఇటీవల పీయూసీ (ఇంటర్) పరీక్షలు రాసింది. తల్లి పద్మజా సొంతంగా ఓ కంపెనీ నడుపుతున్నది. కూతురు సాహితీతో కలిసి బనశంకరిలోని శాస్త్రినగర్‌లో నివసిస్తున్న పద్మజా ఆమె కూతురిని చాలా బాగా చూసుకుంటున్నది, కూతురు సాహితీ పైచదువులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పద్మజాకు రెండు రోజుల క్రితం నిరాశే ఎదురైంది.

ఇంటర్ పరీక్షకు హాజరైన సాహితి రెండు సబ్జెక్టుల పరీక్షలు రాయకుండా ఇంటికి తిరిగి వచ్చింది. అయితే కూతరు సాహితీ తాను పరీక్షలు రాయలేదని ఆమె తల్లి పద్మజాకు చెప్పలేదు. తరువాత తన కూతురు పరీక్షలు రాయలేదనే విషయం పద్మజాకు తెలిసింది. ఇదే విషయంలో తల్లీకూతుళ్ల మధ్య గొడవ జరిగింది.

అంతకుముందు సాయంత్రం తల్లీకూతుళ్ల మధ్య పరీక్షలు రాసే విషయంలో సాహితీ ఆమె తల్లి పద్మజాతో తీవ్రస్థాయిలో వాదించిందని తెలిసింది.

రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇదే విషయంలో గొడవ జరగడంతో కోపోద్రిక్తురాలైన పద్మజా ఇంట్లో ఉన్న కత్తి తెచ్చి కూతురు సాహితీ ఛాతీపైనా, శరీరంలోని ఇతర భాగాలపైనా పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో సాహితీ ఇంట్లోనే కుప్పకూలింది. ఆ తర్వాత అదే కత్తితో పొట్టపై ఉరేసుకున్న పద్మజా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. బంధువులు పద్మజా ఇంటికి వెళ్లి విషయం గుర్తించి తరువాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పద్మజాను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.సాహితీ మృతదేహానికి కిమ్స్‌ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+