ఎవరెస్ట్‌పై మంచు తుపాను భీభత్సం.. వేల అడుగుల ఎత్తులో 1000 మంది !!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్‌పై మంచు తుఫాను భీభత్సం సృష్టించింది. ఈ ఘటనతో వేల అడుగుల ఎత్తులో సుమారు 1000 మంది పర్వతారోహకులు మంచు శిఖరంపై చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు ప్రారంభించారు.
టిబెట్‌లో ఎవరెస్ట్ తూర్పు వాలు ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం నుంచి భారీగా మంచు కురుస్తూనే ఉంది. ఇది ఆదివారం నాటికి మంచు తుఫానుగా మారింది. దీంతో దాదాపు 1000 మంది క్యాంప్‌సైట్ల వద్ద చిక్కుకుపోగా.. వారిని రక్షించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 350 మందిని రక్షించి క్యుడాంగ్ అనే చిన్న టౌన్‌షిప్‌కు తరలించారు.

ఎవరెస్ట్ పైకి వెళ్లే మార్గాలను భారీ మంచు చరియలు మూసివేశాయి. వీటిని తొలగించడానికి వందలాది మంది స్థానికులు, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సాధారణంగా పర్వతారోహకులు, హైకర్లు ఈ మార్గం గుండానే ఎవరెస్ట్ అధిరోహించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం చైనాలో సెలవులు కావడంతో ఈ మార్గంలో పర్వతారోహకుల రద్దీ మరింత పెరిగింది.
ఇక అదే సమయంలో మంచు తుఫాను సంభవించడంతో వీరంతా పర్వతంపై చిక్కుకుపోయారు. తీవ్రమైన చలి కారణంగా హైకర్లు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది హైకర్లు ఇప్పటికే హైపోథెర్మియా బారినపడినట్లు రెస్క్యూ బృందం వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శనివారం నుంచి ఎవరెస్ట్ పైకి వెళ్లేందుకు అనుమతులను నిలిపివేశారు. సాధారణంగా అక్టోబరు నెలలో ఈ మంచు పర్వతంపై ఇలాంటి ప్రతికూల వాతావరణం నెలకొంటుంది.
మరోవైపు నేపాల్‌లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఇప్పటివరకు 52 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications