వరుసగా సీఎంలను భేటీ అవుతున్న యువహీరో, పొలిటికల్ స్కెచ్ లు, తాత, తండ్రి అడుగుల్లో !
బెంగళూరు/లక్నో: కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు, సినీ హీరో నిఖిల్ కుమారస్వామి ఓడిపోయారడు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఓటమిని ఏమాత్రం పట్టించుకోని యువహీరో నిఖిల్ కుమారస్వామి 2024 లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చాలా యాక్టివ్‌గా మారారు.
బీజేపీ-జేడీఎస్ పొత్తు తర్వాత నిఖిల్ కుమారస్వామి రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా యాక్టివ్‌గా మారిపోయారు. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ లింగాయత్ కమ్యూనిటీ నాయకుడు బీఎస్ యడ్యూరప్ప గతంలో కలిశారు, అయితే ఇప్పుడు జేడీఎస్ పార్టీ నాయకుడు నిఖిల్ కుమారస్వామి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలవడం హాట్ టాపిక్ అయ్యింది.

గతంలో యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేయడం ఖాయం అని జేడీఎస్ వర్గాలు అంటున్నాయి.
2024 లోక్‌సభ ఎన్నికల్లో నిఖిల్ కుమారస్వామి పోటీ చెయ్యడానికి అవకాశం ఉంటుందా ?, లేదా మధ్యలో ఎవరైనా ఎంట్రీ ఇస్తారా అని చర్చ మొదలైయ్యింది. బీజేపీ-జేడీఎస్ పొత్తులో భాగంగా మండ్య నుంచి కూటమి అభ్యర్థిగా నిఖిల్ కుమారస్వామి బరిలోకి దిగితే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తారా ? అనే ప్రశ్నలు మొదలైనాయి.

కర్ణాటకలో కాంగ్రెస్ కు సవాల్ విసిరే క్రమంలో బీజేపీతో పొత్తుపై నిఖిల్ కుమారస్వామి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో చర్చించినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అనేక పరిణామాలపై నిఖిల్ కుమారస్వామికి యోగి ఆదిత్యనాథ్ ఉపదేశం చేశారని తెలిసింది. ఈ పర్యటనలో నిఖిల్ కుమారస్వామి ప్రత్యేకంగా తీసుకెళ్లిన రాముడు, లక్ష్మణుడు, సీత విగ్రహాలను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బహుమతిగా ఇచ్చారు.
దీనిపై సోషల్ మీడియాలో నిఖిల్ కుమారస్వామి వివరణ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమై కొన్ని విషయాలపై చర్చించామని అన్నారు. లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్, బీజేపీ పొత్తుపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తో చర్చించామని, ఆయన సూచనలు, సలహాలు తీసుకున్నానని, ఇది చాలా మంచి పరిణామమని నిఖిల్ కుమారస్వామి సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో నన్ను దగ్గర తీసుకుని మాట్లాడిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీకి ధన్యవాదాలు అంటూ నిఖిల్ కుమారస్వామి ఆయన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.












Click it and Unblock the Notifications