కదులుతున్న బస్సులో ప్రసవం.. బయటకు విసిరిపారేసిన కసాయి తల్లి
అమ్మతనం ప్రతి స్త్రీకి ఎంతో ప్రత్యేకం. గర్భం దాల్సిన నాటి నుంచి తన కలల పంట పుట్టి పెరిగేంత వరకు తనను తాను మర్చిపోయి పుట్టిన బిడ్డ కోసం తన సర్వస్వాన్ని దారపోస్తుంది. కానీ ఓ తల్లి మాత్రం తన కడుపున పుట్టిన బిడ్డ పాలిట యమపాశంగా మారింది. కదులుతున్న బస్సులో బిడ్డకు జన్మనిచ్చిన ఓ యువతి.. ఆ తర్వాత దారుణానికి ఒడిగట్టింది. ఆ పసిగుడ్డును బస్సులో నుంచి బయటకు విసిరిపారేసింది. కళ్లు తెరవని ఆ చిన్నారిని రోడ్డు మీదకు విసిరి ప్రాణం తీసింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పర్బణీలో చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో 19 ఏళ్ల యువతితో ఆమె భర్త అని చెప్పుకొని బస్సు ఎక్కిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే?
మహారాష్ట్రలో పర్బణీ నుంచి పుణె వెళ్తున్న స్లీపర్ బస్సులో ఓ జంట ఎక్కింది. మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో బస్సు సేలు రోడ్డుకు చేరుకోగానే ఒక వస్త్రంలో చుట్టి ఏదో బయట పడేశారు. కిటీకీలోంచి అది చూసిన డ్రైవర్.. ఏదో బయట పడేశారని గమనించాడు. డ్రైవర్ బస్సు ఆపి.. వెనుకకు వచ్చి వారిని అడిగినప్పుడు.. బస్సు ప్రయాణం కారణంగా తన భార్యకు వికారం వచ్చి వాంతి చేసుకుందని సదరు వ్యక్తి చెప్పాడు. ఇంతలో రోడ్డుపై ఉన్న ఒక వ్యక్తి కిటికీలోంచి పడేసిన గుడ్డను తనిఖీ చేయగా.. ఒక పసిబిడ్డ అని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. దీంతో బస్సులోని ప్రయాణీకులంతా ఆ జంటను నిలదీశారు. వెంటనే 112 హెల్ప్ లైన్ కు కాల్ చేసి పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో రితికా ధేరే, అల్తాఫ్ షేక్ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను పోషించే స్థోమత లేకపోవడం వల్ల తాము నవజాత శిశువును పడేశామని ఆ జంట చెప్పింది. రోడ్డుపై పడేయడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రితికా ధేరే, అల్తాఫ్ షేక్ ఇద్దరూ పర్బణీకి చెందిన వారే. గత ఒకటిన్నర సంవత్సరం నుంచి పుణెలో నివసిస్తున్నారు. తాము భార్యాభర్తలమని చెప్పుకున్నారు కానీ.. దానిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలను చూపించలేకపోయారు. వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత, పోలీసులు మహిళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సదరు యువతి డిశ్చార్జి అయిన అనంతరం జంటను పోలీసులు విచారించే అవకాశం ఉంది. మరణించిన మగశిశువుకు పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం










Click it and Unblock the Notifications