Pappu Yadav: ధనవంతులు కుంభమేళాకు వెళ్లి చనిపోవాలి.. ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Pappu Yadav: బీహార్ కు చెందిన స్వతంత్ర ఎంపీ రాజేశ్ రంజన్(పప్పూ యాదవ్) లోక్ సభలో వివావాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాకుంభమేళాకు హాజరవుతున్న రాజకీయ నాయకులు, ధనవంతులు అక్కడే చనిపోవాలని.. అప్పుడే వారికి మోక్షం లభిస్తుందని వ్యాఖ్యానించారు. మహాకుంభమేళా తొక్కిసలాట తర్వాత దాదాపు 300 నుంచి 600 మృతదేహాలను అక్కడి నుంచి తొలగించారని.. మృతులకు అంత్యక్రియలను హిందూ సంప్రదాయాల ప్రకారం చేయలేదని ఆయన ఆరోపించారు. అక్కడ చనిపోయినవారంతా మోక్షం పొందారని ఒక బాబా చెప్పారని లోక్ సభలో అన్నారు.
బాబాలు, రాజకీయవేత్తలు ధనవంతులు కూడా త్రివేణి సంగమంలో మునిగి అక్కడే చనిపోవాలి.. మోక్షం పొందాలని ఎంపీ రాజేశ్ రంజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎంపీ పప్పూ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నేతల నోటి నుంచి మాట రాలేదు. కుర్చీపై ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ జగదంబికా పాల్ ఆయనను అడ్డుకున్నారు. ఇంతలో పప్పు యాదవ్ ప్రభుత్వంపై తన తీవ్ర దాడిని కొనసాగించారు. నోట్ల రద్దు, జీఎస్టీ నుంచి ద్రవ్యోల్బణం వరకు అనేక అంశాలపై ఆయన ప్రభుత్వాన్ని చుట్టుముట్టారు.

ఇదిలా ఉండగా.. మహాకుంభమేళా ఘటనలో మృతుల సంఖ్యను యూపీ ప్రభుత్వం దాచిపెడుతోందని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై లోక్ సభలో చర్చలో పాల్గొన్న అఖిలేశ్ యాదవ్.. మహాకుంభమేళా నిర్వహణలో లోపాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడ మృతదేహాలు తొలగించడానికి ప్రభుత్వం జేసీబీ యంత్రాలను, ట్రాక్టర్లను ఉపయోగించిందని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.ప్రభుత్వం నిరంతరం బడ్జెట్ లెక్కలను చెబుతూనే ఉందని.. అదే విధంగా మహాకుంభమేళాలో మరణించిన వారి గణాంకాలను కూడా ఇవ్వాలన్నారు.
అక్కడి ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కుంభమేళా నిర్వహణ బాధ్యతలను ఆర్మీకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మహా కుంభమేళా తొక్కిసలాటలో మరణించిన వారి గణాంకాలు, గాయపడిన వారికి చికిత్స, మందులు, వైద్యులు, ఆహారం, నీరు, రవాణా లభ్యత వంటి వివరాలను పార్లమెంటులో సమర్పించాలని ఆయన అన్నారు. నేరం లేకుంటే గణాంకాలను ఎందుకు దాస్తున్నారని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications