మాజీ ప్రధాని, మాజీ సీఎంపై సుమలత సంచలన వ్యాఖ్యలు, మోదీకి ఇచ్చిన మాట కోసం నేను!
ప్రజాప్రతినిదిగా ఓటు వేయడం నా కర్తవ్యం, అందరిలాగే నేను కూడా సామాన్యురాలినే అని, అందుకే నేను ఓటు చేశాను అని, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ వ్యాఖ్యలపై నేను స్పందించను అని, సరైన సమాచారం లేకుండా ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని, మాజీ ప్రధాని నుంచి అలాంటి మాటలు వస్తాయని తాను ఊహించలేదని మండ్య ఎంపీ, బీజేపీ నాయకురాలు సుమలత అంబరీష్ అన్నారు.
మాజీ ప్రధాని దేవేగౌడ నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తాయని తాను ఊహించలేదని మండ్య ఎంపీ సుమలత అంబరీష్ అన్నారు. దేవేగౌడ చాలా పెద్ద మనిషి అని, స్వతంత్ర పార్టీ ఎంపీగా తన బాద్యత తాను నెరవేర్చానని సుమలత అంబరీష్ అన్నారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని నేను బావించానని, అందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మండ్య సీటును జేడీఎస్ కు త్యాగం చేశానని సుమలత అంబరీష్ అన్నారు.

మోదీ కోసం తాము అంబరీష్ అభిమానుల బలం కూడా ఎన్డీయేకి ఇచ్చామని, జేడీఎస్, బీజేపీ కూటమి కోసం మా మద్దతుదారులు నమ్మకంగా పనిచేశారని సుమలత అన్నారు. జేడీఎస్ నేతలను తనను ఎలాంటి సభలకు, ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించలేదని, వాళ్లు తనకు ఫోన్ చేసి పిలిచిన తరువాత నేను వెళ్లకపోతే అది తప్పు అని, కానీ వారు నన్ను ఎక్కడికి పిలవలేదని, ఎన్నికల ప్రచారానికి పిలవలేదని, పిలవని పేరంటానికి తాను వెళ్లడంలో ఏమైనా అర్థం ఉందా అని సుమలత జేడీఎస్ నాయకులను ప్రశ్నించారు.
జేడీఎస్ నాయకులు నన్ను పిలవకపోవడం బాధాకరం అని, మాజీ ప్రధాని దేవెగౌడ వ్యాఖ్యల తరువాత నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని, ఏం జరిగింది అని అడిగారని, నేను ఎలాంటి ప్రమోషన్ కోసం పాకులాడలేదని సుమలత అన్నారు. మాజీ సీఎం కుమారస్వామి మా ఇంటికి వచ్చి వెళ్లిన తర్వాత కూడా నాకు ఎవరు ఫోన్ చేసి ఎన్నికల ప్రచారానికి రమ్మని అడగలేదని, ఇన్ని త్యాగాలు చేసినా తనను పిలవలేదని తాను బాధపడ్డానని, నేను ఏతప్పు చేసాను? ఎందుకు తనను ఎన్నికల ప్రచారానికి పిలవలేదు అని చాలా ఆలోచించానని సుమలత అన్నారు.

తనను మండ్యలో ఎన్నికల ప్రచారానికి జేడీఎస్ నాయకులు పిలవలేదని తన అభిమానులు కొందరు నిరసన తెలిపారని, తాను తన సీటును కావాలని వదులుకోలేదని, కేలం మోదీ కోసం ఇచ్చిన మాట కోసం తాను గెలిచే సీటును వదులుకున్నానని, అయితే జేడీఎస్ నాయకుల మనసులో ఏముందో నాకు తెలియదని సుమలత అన్నారు. తనను ఎన్నికల ప్రచారానికి పిలవలేదని తాను బాదపడలేదని, తాను గెలిచే సీటను వదులుకున్న సమయంలో కూడా తాను బాదపడలేదని సుమలత అన్నారు.
అయితే మాజీ ప్రధాని దేవేగౌడ మాట్లాడిన మాటలకు తాను బాదపడ్డానని సుమలత అంబరీష్అన్నారు. కర్ణాటకలోని 28 లోక్ సభ నియోజక వర్గాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవాలని తాను కోరుకుంటున్నానని సుమలత అంబరీష్ చెప్పారు. మండ్య ఎంపీ సుమలత జేడీఎస్ దళపతులు, మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ, మాజీ సీఎం కుమారస్వామి మీద పరోక్షంగా విరుచుకుపడటం హాట్ టాపిక్ అయ్యింది. అయితే మైసూరులో బీజేపీ కోసం ఎన్నికల ప్రచారం చేసిన సుమలత అంబరీష్ ఆమె సొంత నియోజక వర్గం మండ్యలో ఎన్డీఏ కూటమిలోని జేడీఎస్ కోసం ఎన్నికల ప్రచారం చెయ్యకపోవడం హాట్ టాపిక్ అయ్యింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications