Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సుమలత సంచలన నిర్ణయం, అయితే ?, నేను ఎక్కడికి వెళ్లను, రెబల్ స్టార్ ఫ్యాన్స్ ముఖ్యం !

లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని, ఇదే సమయంలో కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించాలని బీజేపీ నాయకులు జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్నారు. అయితే అంతా సవ్యంగా సాగినా మండ్య ఎంపీ సీటు విషయంలో ఈ రోజు వరకు బీజేపీ, జేడీఎస్ నాయకులు ఇన్ని రోజులు ఏం చెయ్యాలో తెలీక తలలు పట్టుకుంటూనే వచ్చారు.

మండ్య ఎంపీ సుమలత అంబరీష్ విషయంలో బీజేపీ, జేడీఎస్ నాయకులు హడలిపోయారు. అయితే బుధవారం మండ్య జిల్లా ప్రజలతో పాటు బీజేపీ, జేడీఎస్ నాయకులు ఊపిరిపీల్చుకున్నారు. తన మద్దతుదారులతో సమావేశం అయ్యి చర్చలు జరిపిన మండ్య ఎంపీ సుమలత అంబరీష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుమలత నిర్ణయంతో బీజేపీ నాయకుల కంటే జేడీఎస్ నాయకులు చాలా సంతోషంగా ఎగిరిగంతేస్తున్నారు.

MP Sumalatha has given clarity that she will not contest the Mandya Lok Sabha elections
బుధవారం మండ్య జిల్లాలో ఎంపీ సుమలత అంబరీష్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు నాకు ఎప్పుడూ అనివార్యం కాదని, ఈరోజు కూడా తనకు రాజకీయాలు అవసరం లేదని అన్నారు. తాను ప్రస్తుతం జరగుతున్న ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అయితే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మండ్యను వదిలి వెళ్లనని ఎంపీ సుమలత అంబరీష్ అన్నారు.మండ్యలోని కాళికాంబ ఆలయం ప్రాంగణంలో బుధవారం మండ్య ఎంపీ సుమలత అంబరీష్ ఆమె మద్దతుదారులు, అంబరీష్ అభిమానులతో సమావేశం అయ్యారు.

ఈ సందర్బంగా ఎంపీ సుమలత మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికలు అంటే తమాషా కాదన్నారు. ద్వేషం కోసమో, మొండితనం కోసమో తాను పోటీ పడాల్సి వస్తే ఇంకా తాను పోటీ చెయ్యడానికి సిద్దమే అని, , అయితే దీని వల్ల ఎవరు నష్టపోతారో కూడా మనం ఆలోచించాలని మండ్య ఎంపీ సుమలత అన్నారు. నేను కేవలం ఎంపీ కావాలనుకుంటే బీజేపీ గెలవగలిగే చాలా నియోజకవర్గాల్లో తాను ఎంపీగా పోటీ చేసి ఉండేదానిని అని, అయితే తాను సాధారణ రాజకీయ నాయకురాలిని కాదని సుమలత అన్నారు.

MP Sumalatha has given clarity that she will not contest the Mandya Lok Sabha elections

తనకు ఎలాంటి రాజకీయాలు ఉన్నా అది కేవలం మండ్యలో మాత్రమే అని, మండ్య లేకపోతే తనకు రాజకీయాలు అక్కర్లేదని సుమలత అంబరీష్ కుండలు బద్దలుకొట్టినట్లు చెప్పారు. అంబరీష్ అభిమానులు ఉండే మండ్యను వదిలి వెళ్లాలని తాను కలలో కూడా అనుకోనని, అందుకే తాను వేరే లోక్ సభ నియోజక వర్గాల్లో పోటీ చెయ్యలేదని సుమలత వివరణ ఇచ్చారు. మండ్యను ఎందుకు వదలడం లేదనే దానికి సుమలత వివరణ ఇచ్చారు.

తాను ఎంపీ అయిన తరువాత మండ్యలో 4 వేల కోట్లతో మండ్య జిల్లా అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చిందని, ప్రధాని మోదీ చలువ వలనే అంత మొత్తంలో మండ్యకు నిధులు మంజూరు చేసుకోవడానికి అవకాశం వచ్చిందని సుమలత అన్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు అవకాశం ఉందని, అయితే తాను పోటీ చెయ్యదలచుకోలేదని అన్నారు. గతంలో సుమలత అవసరం మాకు లేదని, భవిష్యత్తులోనూ ఆమె అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అన్నారని, అయితే తనకు గౌరవం లేని చోటికి నేను వెళ్లను అని సుమలత కాంగ్రెస్ పార్టీ నాయకులకు కౌంటర్ ఇచ్చారు.

బీజేపీ పట్ల ఎంతో గౌరవంతో ఆ పార్టీకి మద్దతివ్వాలని అనుకున్నానని, ఇప్పుడు అదే చేస్తున్నానని సుమలత చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వార్థ రాజకీయాలు చేయకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, నేను ఈరోజు మండ్యలో ఎంపీగా ఉన్నానని, రేపు మరో పదవి పొందవచ్చు అని, తరువాత కూడా తాను మండ్య ప్రజలకు అందుబాటులోనే ఉంటానని సుమలత అన్నారు. తాను త్వరలో బీజేపీలో చేరుతున్నానని, కాంగ్రెస్ లో ఎట్టిపరిస్థితుల్లో చేరని ఎంపీ సుమలత క్లారిటీ ఇచ్చారు. సుమలత నిర్ణయంతో మండ్యలో ఎంపీగా పోటీ చేస్తున్న మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామితో పాటు జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు ఫుల్ హ్యాపీ అవుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+