మోడీ! నేను రాహుల్‌గాంధీని కాదు: కేజ్రీవాల్ ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ధ్వజమెత్తారు. భయపడేందుకు తాను రాహుల్ గాంధీనో, సోనియా గాంధీనో లేక రాబర్డ్ వాద్రానో కాదని వ్యాఖ్యానించారు. కేసులు పెడితే భయపడేది లేదన్నారు.
కేసులకు తాను భయపడబోనన్నారు. వాటర్ ట్యాంకర్ స్కాములో భాగంగా పోలీసులు రూపొందించిన ఎఫ్ఐఆర్‌లో నిందితుడిగా తన పేరు పెట్టడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ప్రధాని మోడీ తానంటే భయపడుతున్నాడన్నారు.

అందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ చర్యతో ప్రధాని మోడీ పోరు తనతోనే అని చెప్పకనే చెప్పారన్నారు. నిజాలేంటో విచారణలో తేలుతాయన్నారు.
2012లో ఢిల్లీ వాసులకు నీళ్లను సరఫరా చేసేందుకు 385 వాటర్ ట్యాంకర్లను అద్దెకు తీసుకోగా, ఈ వ్యవహారంలో రూ.400 కోట్ల అవినీతి జరిగిందని చెబుతూ.. ఏఏపీ ప్రభుత్వం కమిటీ వేయగా, లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు కేసు పెట్టిన పోలీసులు షీలా దీక్షిత్‌తో పాటు కేజ్రీవాల్‌నూ ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.












Click it and Unblock the Notifications