సొంత పార్టీ మాజీ సీఎం, రెడ్డిని టార్గెట్ చేసిన ఎంటీబీ, రూ.వేల కోట్లు ఉంటే ఏం ప్రయోజనం !
బెంగళూరు/చిక్కబళ్లాపురం: ఎంటీబీ నాగరాజ్, ఈ పేరు బెంగళూరుతో పాటు కర్ణాటకలో చాలా ఫేమస్. ఎందుకంటే కర్ణాటకలో వేలాది కోట్లు ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన గతంలో గుర్తింపు తెచ్చుకున్నరు. ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంటీబీ నాగరాజ్ ఓడిపోయారు. తన ఓటమికి కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్, మాజీ మంత్రి డాక్టర్ కే. సుధాకర్ కారణం అని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు, ఎమ్మెల్సీ ఎంటీబీ నాగరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేను ఓడిపోవడానికి చిక్కబళ్లాపూర్‌కు చెందిన మాజీ మంత్రి డాక్టర్ కే. సుధాకర్ మాత్రమే కారణం కాదు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బోమ్మయ్ కూడా కారణమని కర్ణాటక మాజీ మంత్రి ఎంటీబీ నాగరాజ్ ఆరోపించారు. బీజేపీ ఆత్మపరిశీలన సభలో మాజీ మంత్రి ఎంటీబీ నాగరాజ్ మాట్లాడుతూ సొంత పార్టీ నాయకులతో పాటు కొందరిని టార్గెట్ చేసుకుని మాట్లాడటం కలకలం రేపింది.

చాలా మంది మోసం చెయ్యడం వలనే తాను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని బెంగళూరు గ్రామాణ జిల్లాలోని హోస్ కోటే నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా ఓడిపోయిన మాజీ మంత్రి ఎంటీబీ నాగరాజ్‌విరుచుకుపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తున్నారా అని అభిమానులు, బీజేపీ కార్యకర్తలు అడగగా వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చెయ్యనని, తాను ఎంటీ టిక్కెట్ కూడా ఆశించడం లేదని. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తికూడా తనకు లేదని మాజీ మంత్రి ఎంటీబీ నాగరాజ్ అన్నారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బోమ్మయ్ కావాలనే చిక్కబళ్లాపూర్ ఎమ్మెల్యే డాక్టర్ కే. సుధాకర్‌కు బెంగళూరు గ్రామీణ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి బాధ్యతలు అప్పగించారని, ఆ జిల్లా బాధ్యతలు తనకు అప్పగించే ఉంటే హోస్ కోటే నియోజక వర్గంలో తాను ఇంకా ఎక్కువ పనులు చేసే అవకాశం ఉండేదని, అయితే ఆ సువర్ణావకాశాన్ని తనకు తప్పించిన అప్పటి సీఎం బసవరాజ్ బోమ్మయ్ డాక్టర్ సుధాకర్ ఇన్ చార్జ్ మంత్రి పదవి ఇచ్చి తనను మోసం చేశారని, సుధాకర్ తన నియోజక వర్గాన్ని పట్టించుకోలేదని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోవాల్సి వచ్చిందని మాజీ మంత్రి ఎంటీబీ నాగరాజ్ ఆరోపించారు.

కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు హోస్ కోటే తాలూకా పార్టీ నాయకులకు కార్పొరేషన్, బోర్డుల చైర్మన్ పదవులతోపాటు ప్రభుత్వంలో ఎలాంటి నామినేటెడ్ హోదా పదవులు ఇవ్వకుండా బసవరాజ్ బోమ్మయ్ నిర్లక్షం చేశారని, కనీసం స్థానికుల్లో కొందరికైనా నామినేటెడ్ పదవులు వచ్చి ఉంటే తాను ఇంకా బలపడేవాడినని, కానీ అలా జరగలేదని మాజీ మంత్రి ఎంటీబీ నాగరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో నన్ను మోసం చేసిన హోస్ కోటేలోని ముస్లింల మీద కూడా ఎంటీబీ నాగరాజ్ విరుచుకుపడ్డారు. నా నియోజకవర్గంలో మైనార్టీలకు తన శక్తికి మించి సాహాయం చేశానని, అయినా నన్ను ముస్లీం ఓటర్లు మోసం చేశారని ఎంటీబీ నాగరాజ్ ఆరోపించారు. నాకు ఓటు వేస్తామని ఖురాన్ మీద, అల్లా మీద ప్రమాణం చేసిన ముస్లీం సోదరులు నాకు ఓటు వేయకుండా మోసం చేశారని ఎంటీబీ నాగరాజ్ ఆరోపించారు.

ముస్లింలు బీజేపీకి ఓటు వేయలేదు. బీజేపీ ఇచ్చిన నోట్లు తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని, ఇకపై వారిని నమ్మబోమని మాజీ మంత్రి ఎంటీబీ నాగరాజ్ మండిపడ్డారు. వేలకోట్లాది రూపాయల ఆస్తులకు యజమాని అయిన ఎంటీబీ నాగరాజ్ మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని టార్గెట్ చేస్తూ బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడటం ఇప్పుడు బీజేపీలో కలకలం రేపింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications