ముకేష్ అంబానీ, ఫ్యామిలీకి 8 సార్లు బెదిరింపు కాల్స్: కేసు నమోదు
ముంబై: భారత కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి మరోసారి బెదిరింపులు వచ్చాయి. అంబానీతో పాటు ఆయన కుటుంబాన్ని బెదిరిస్తూ ఓ ఆగంతుకుడు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నెంబర్‌కు ఈ కాల్ వచ్చినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆస్పత్రి వర్గాలు డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. ఏకంగా ఎనిమిది సార్లు దుండగుడు బెదిరింపు కాల్స్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పోలీసులు ఈ కాల్స్ వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని, నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ సీఈఓ, తరంగ్ జియాంచందానీ మాట్లాడుతూ.. 'మాకు 8 సార్లు బెదిరింపు కాల్‌లు వచ్చాయి, ఈ రోజు మేము కాల్ చేసిన వ్యక్తిని ఉగ్రవాదిగా పరిగణిస్తున్నాము, మేము ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసాము. మేము మా సెక్యూరిటీ గార్డులకు కూడా చెప్పాము' అని అన్నారు.
"ముకేష్ అంబానీ మరియు కుటుంబ సభ్యులను బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తి నుండి కాల్ వచ్చింది" అని ఆమె తెలిపారు.
కాగా, గతంలోనూ అంబానీ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. గతేడాది ఆయన నివాసం అంటిలియా వద్ద పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియో కనిపించడం కలకలం రేపింది. కొందరు దుండగులు జిలెటిన్ స్టిక్స్ ఉన్న కారును అంబానీ ఇంటి వద్ద నిలిపి ఉంచారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ కారును పోలీసులు గుర్తించి తనిఖీ చేయగా.. అంబానీని హెచ్చరిస్తూ ఉన్న లేఖ లభ్యమైంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications