బాహుబలి-2 సినిమా చూసిన ములాయం సింగ్, అఖిలేష్ గైరాజర్

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మంగళవారం నాడు పార్టీకి చెందిన ముఖ్యులతో కలిసి బాహుబలి 2 సినిమాను చూశారు. అయితే ఈ సినిమా చూసినవారిలో అఖిలేష్ యాదవ్ మాత్రం లేరు.

లక్నోలోని ఓ సినిమాథియేటర్ ను ములాయం తాను సినిమా చేసేందుకు బుక్ చేసుకొన్నారు.తనకు సన్నిహితులను, సహచరులను మాత్రమే ఆయన సినిమాకు పిలిచారు.

mulayamsingh yadav

ములాయంతో సినిమాకు వెళ్ళిన పార్టీ నాయకుల్లో శివపాల్ కు అత్యంత సన్నిహితులు మాత్రమే ఉన్నారు. శివపాల్ కు అనుచరులైన అషుమాలిక్, మహ్మాద్ షాహిద్ తదితరులున్నారు.

మొత్తం థియేటర్ అంతటిని కేవలం తమ కోసమే ములాయం బుక్ చేసుకొన్నారు. అయితే ఈ సినిమా చూసేందుకు ములాయం సింగ్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు ఎవరూ లేరు.అంతేకాదు అఖిలేష్ వర్గానికి చెందిన వారు కూడ ములాయంతో వెళ్ళలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Reeling under the attacks by his own son, Samajwadi Party patriarch Mulayam Singh Yadav, on Tuesday, went to see why Baahubali was killed by Katappa, whom he considered family.
Please Wait while comments are loading...