ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి మరింత క్లిష్టం: మేదాంత ఆస్పత్రి వర్గాలు

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ మరింత విషమించింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ప్రస్తుతం హర్యానా గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. జీవనాధార ఔషధాలతో ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది అని మేదాంత ఆస్పత్రి తాజాగా బులిటెన్ విడుదల చేసింది.

‘Mulayam Singh Yadav quite critical, on life-saving drugs’, says Medanta Hospital.

ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22న ఆస్పత్రిలో చేరిన ములాయం సింగ్ యాదవ్.. అప్పట్నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం ఆదివారం మరింత క్షీణించిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ఈ మేరకు సమాజ్‌వాదీ పార్టీ కూడా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. కాగా, ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆస్పత్రికి వెళ్లి ములాయంను పరామర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+